గంటల తరబడి కూర్చోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, శరీరంలో కొవ్వు పెరిగిపోవడం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. మొత్తం మీద ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి.