గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి అసలే తినకూడదు మరి..

First Published Dec 13, 2022, 2:58 PM IST

మనం తింటున్న ఆహారమే మన గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. కొన్నిరకాల ఆహారాలు గుండెను ఆరోగ్యంగా ఉంచితే.. మరికొన్ని దెబ్బతీస్తున్నాయి. ఏదైనా తింటున్నప్పుడు అది మంచిదా? కాదా? అన్న సంగతిని తెలుసుకోండి. 
 

heart health

అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అందుకే జీవన శైలిని మెరుగ్గా ఉంచుకోవాలి. చెడు ఆహారాలను అసలే తినకూడదు. ఈ అలవాట్ల వల్ల మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. గుండె  ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాద కారకాల్లో ఆహారం ఒకటి. కొన్ని రకాల ఫుడ్స్ గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సమస్యలకు దారితీస్తాయి. అసలు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉప్పు, చక్కెర

ఉప్పు, చక్కెరలు మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. అలా అని వీటిని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ఎన్నో రోగాలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు. ఉప్పును ఎక్కువగా తింటే బీపీ బాగా పెరిగి గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే గుండె ఆరోగ్యం కోసం ముందుగా వీటిని తగ్గించండి. 
 

రెడ్ మీట్

ఎర్ర మాంసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలా అనే చాలా మంది రెడ్ మీట్ ను ఎక్కువగా తింటుంటారు. పోషకాలున్న మాట వాస్తవమే కానీ.. ఇది మన పాణానికి అస్సలు మంచిది కాదు. బేకన్, సాసేజ్, హాట్ డాగ్ వంటి ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ లను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అలాగే గుండె ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అందుకే వీటిని తినడం తగ్గించండి.

ప్యాకేజ్డ్ ఫుడ్స్

ప్యాకేజ్డ్ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందులో బేకరీ స్నాక్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.  ఇవి శరీర బరువును అమాంతం పెంచుతాయి. వీటిలో చక్కెర, ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర ప్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కూడా.
 

soft drinks

శీతల పానీయాలు

శీతల పానీయాలు, సోడాలను పెద్దవారు నుంచి యూత్ కూడా ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి కావు. సోడాలో ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి కాల్షియాన్ని గ్రహించే  సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మన శరీరంలో తగినంత కాల్షియం లేకుంటే.. ఎముక బలం తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి, దంత క్షయం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే అధిక బరువు, ఉబ్బరం, గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది.
 

కార్భోహైడ్రేట్లు

వైట్ రైస్, వైట్ బ్రెడ్, పాస్తా మొదలైన వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ ఊబకాయం, మధుమేహానికి దారితీస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి.

పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపల చిప్స్ లల్లో కొవ్వు, కేలరీలు, సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలను అసలే తినకూడదు. అప్పుడే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

click me!