మెత్తని పరుపులపై పడుకోగాలనే తొందరగా నిద్రొస్తుంది. అందుకే ప్రస్తుతం అందరూ మెత్తని పరుపులపైనే నిద్రపోతున్నారు. మరీ కొందరికైతే పరుపు లేనిదే నిద్రకూడా పట్టదు. కానీ ఇలాంటి అలవాటు అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. మన శరీరానికి మెత్తగా ఉండే పరుపులు చేసే నష్టం అంతా ఇంతా కాదు. వీటిపై పడుకోవడం వల్ల ఉదయం బాగా అలసిపోయినట్టుగా ఉంటుది. కాళ్లు, చేతులు, పాదాలు బాగా నొప్పి పెడతాయి. వెన్ను నొప్పి కూడా ఉంటుంది. నిజానికి ఈ సమస్యలు మీరు నిద్రపోయే ప్లేస్, పరుపు కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. దీనిపై పడుకోవడం వల్ల శరీరంలో తిమ్మిరి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో పరుపుపై పడుకోవడం కంటే నేలపై పడుకోవడమే మంచిదంటున్నారు నిపుణుల. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి.