ఆరోగ్యానికి మంచిదని ముల్లంగిని ఎక్కువగా తింటే ఈ తిప్పలు తప్పవు జాగ్రత్త..

Published : Nov 15, 2022, 09:51 AM IST

శీతాకాలంలో ముల్లంగిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలా అని అతిగా తింటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
16
 ఆరోగ్యానికి మంచిదని ముల్లంగిని ఎక్కువగా తింటే ఈ తిప్పలు తప్పవు జాగ్రత్త..

ఇతర కాలాలతో పోల్చితే శీతాకాలంలోనే ముల్లంగిని ఎక్కువగా తింటుంటారు. ముల్లంగి షుగర్ పేషెంట్లకు దివ్య ఔషదంతో సమానం. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ కూరగాయలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా రక్షిస్తాయి. ముల్లంగిలో కరిగే, కరగని ఫైబర్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా జరగడానికి, దీని పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ముల్లంగిని తింటే అజీర్థి సమస్య రాదు. మలబద్దకం నుంచి బయటపడతారు. 

26

ముల్లంగిలో ఎన్నో ఔషదగుణనాలుంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కాలెయ పనితీరును మెరుగుపరుస్తాయి. కానీ ముల్లంగిని ఎక్కువగా తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు శీతాకాలంలో ముల్లంగిని ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

హైపోథైరాయిడిజం ప్రమాదం

ముల్లంగిని మరీ ఎక్కువగా తినడం వల్ల థైరోట్రోపిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దీనివల్ల హైపోథైరాయిడిజం ప్రమాదం పెరుగుతుంది. ముల్లంగిని ఎక్కువగా తింటే అయోడిన్ పనితీరుపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ఈ కూరగాయను ప్రతిరోజూ తింటే థైరాయిడ్ గ్రంధి బరువు పెరిగిపోతుంది. ఇది థైరాయిడ్ కు సమస్యకు దారితీస్తుంది. మరొక ముఖ్యమైన విషయం.. థైరాయిడ్ పేషెంట్లు ముల్లంగిని అస్సలు తినకూడదు. 

46

హైపోగ్లైసీమియా

ముల్లంగి షుగర్ పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కానీ షుగర్ తక్కువగా ఉండేవాళ్లు ముల్లంగిని తినడం మంచిది కాదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా తగ్గిపోతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండే పరిస్థితినే హైపోగ్లైసీమియా అంటారు. ఇది ప్రాణాంతకమైన అనారోగ్య సమస్య. 
 

56

శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది
 
ముల్లంగి మన శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ముల్లంగిని తింటే తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో బాడీలో నీరంతా బయటకు వెళ్లిపోతూ.. డీహైడ్రేషన్ బారిన పడతాం. డీహైడ్రేషన్  మన శరీరానికి అంత మంచిది కాదు. ఈ కూరగాయను తింటే మన శరీరంలో సోడియం లోపిస్తుంది. దీంతో మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే దీన్ని మరీ  ఎక్కువగా తినడం మంచిది కాదు. 

66

రక్తపోటు సమస్యలు

ముల్లంగిలో పుష్కలంగా ఉండే కొన్ని పోషకాలు రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్లకు ఇది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఒక వేళ మీ శరీరంలో రక్తపోటు తక్కువగా ఉండి.. ముల్లంగిని తింటే మీ బీపీ మరింత తగ్గిపోతుంది. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ కూరగాయలను ఎక్కువగా తింటే మైకము, ఆందోళన వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories