వేప ఆకులను ఎక్కువగా తింటే ఎంత డేంజరో తెలుసా?

First Published Jan 2, 2023, 12:43 PM IST

చర్మ సమస్యల నుంచి కడుపునకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి వేప ఆకులను తింటూ ఉంటారు. నిజానికి వేప ఆకులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అలా అని వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. 
 

వేప ఆకుల్లో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వేప ఆకులను రోజూ కొన్ని తింటే కడుపులోని చెడు బ్యాక్టీరియా చనిపోతుంది. అలాగే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. వేప ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి.  ఇందుకోసం వేప ఆకులను రోజుకు 6 నుంచి 8 ఆకులను మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకంటే ఎక్కువ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..
 

వేప ఆకులు టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం వేప ఆకులను మోతాదులోనే తినాల్సి ఉంటుంంది. మరీ ఎక్కువగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు మరీ దారుణంగా పడిపోతాయి. దీంతో మైకం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. 
 

neem

ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. రోజూ ఒకటి నుంచి రెండు వేపాలకు తింటే చాలు. కానీ దీనికంటే ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతింటాయిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రపిండాలు దెబ్బతింటే మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. 

వేపాకులను మరీ ఎక్కువగా తీసుకుంటే నోట్లో అలెర్జీ వస్తుంది. అలాగే మంట కూడా పెడుతుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. అయినప్పటికీ వేపాకులను దద్దుర్లు, అలెర్జీ సమస్యను తగ్గించుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాయి. వీటిని అప్పుడప్పుడు ఉపయోగించడం వల్ల మంచే జరుగుతుంది. ఎప్పుడూ ఉపయోగిస్తే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. 
 

వంధ్యత్వం

ఎలుకలపై చేసిన పరిశోధనలో వేపను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అండోత్సర్గం పై చెడు ప్రభావం పడిందని వెల్లడైంది. అలాగే ఎన్నో జంతు అధ్యయాల్లో.. వేప మగ సంతానోత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుందని వెల్లడైంది. అందుకే వేప ఆకులను మోతాదులోనే తినాలి. అంతకు మించి తింటే డేంజర్. 
 

click me!