సేమియాను కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్‍లో వేపుకోవాలి. ఇలా చేస్తే ఉడికేటప్పుడు సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది.
food-life Apr 04 2026
Author: Nandini Arava Image Credits:our own
Telugu
నీటి కొలత
ఉప్మా ముద్దవ్వడానికి ప్రధాన కారణం నీరు. కప్పు సేమియాకు 1.5 కప్పుల నీరు చాలు. అంతకంటే ఎక్కువ పోస్తే సేమియా మెత్తబడిపోతుంది.
Image credits: our own
Telugu
మరుగుతున్న నీటిలో వేయాలి
పోపు పెట్టి, నీళ్లు పోశాక.. ఆ నీరు బాగా మరగాలి. అప్పుడే వేయించిన సేమియాను అందులో వేయాలి.
Image credits: our own
Telugu
మంటను మీడియంలో పెట్టుకోవాలి
సేమియా వేసిన తర్వాత ఒక నిమిషం హై ఫ్లేమ్‌లో ఉంచి, ఆ తర్వాత మంటను తగ్గించి మూత పెట్టాలి. నీరంతా ఇంకిపోయేవరకు తక్కువ మంటపైనే ఉడకనివ్వాలి. లేకపోతే ముద్దగా అయిపోతుంది.
Image credits: our own
Telugu
నిమ్మరసం లేదా నూనె
నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో రెండు చుక్కల నిమ్మరసం లేదా ఒక స్పూన్ నూనె వేయండి. ఇది సేమియా పొడిపొడిగా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది.
Image credits: Pixabay
Telugu
ఉడికిన తర్వాత కలపకండి
ఉప్మా ఉడికిన వెంటనే గరిటెతో కలిపేయకూడదు. స్టవ్ ఆపి 5 నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేయాలి. ఆ వేడికి తడి ఆరిపోయి సేమియా విడివిడిగా వస్తుంది.
Image credits: our own
Telugu
ఫోర్క్ తో కలపండి
ఉప్మాను సర్వ్ చేసే ముందు ఫోర్క్ తో నెమ్మదిగా కలపండి, దీనివల్ల సేమియా విరిగిపోకుండా ఉంటుంది.