Almond Side Effects: బాదంతో మస్త్ ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెగ తినేస్తున్నారా? అయితే మీకు ఈ రోగాలు రావడం ఖాయం

First Published Jun 30, 2022, 11:50 AM IST

Almond Side Effects: బాదం పప్పులను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అలా అని బాదం పప్పులను మోతాదుకు మించి తింటే మాత్రం తిప్పలను తప్పక ఎదుర్కోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

నానబెట్టిన బాదం పప్పు (Almond), ఆలివ్ ఆయిల్ (Alive oil), తేనెను (Honey)  మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడంతో చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది.
 

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మన శరీరానికి కాల్సిన పోషకాలను అందిస్తాయి. అందుకే వీటిని క్రమం తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇక ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో మంచి కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు. న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. 
 

Latest Videos


వీటిని రెగ్యులర్ గా తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల రోగాలు సైతం దూరమవుతాయి. బాదం  పప్పులు అధిక బరువును తగ్గించగలవు. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచగలవు. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వీటిని అలాగే తినకుండా నీళ్లలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. 

బాదంతో మస్తు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం శరీరానికి మంచి జరగాల్సింది పోయి చెడు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ బాదం పప్పులను ఎక్కువగా తింటే ఎలాంటి హాని కలుగుతుంతో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బరువు పెరుగుతారు.. 

28 గ్రాముల బాదం పలుకుల్లలో దాదాపుగా 164 కేలరీలు ఉంటాయి. ఇక మీరు ఇతర పోషకాహారంతో పాటుగా బాదం పప్పులను ఎక్కువగా తింటే మీరు ఖచ్చితంగా బరువు (Weight)పెరుగుతారు. ఒకవేల బరువు పెరగకూడదంటే మీరో రోజుకు 5 నుంచి 6 బాదం పలుకులనే మాత్రమే తినాలి. 

మలబద్దకం (constipation) సమస్య వస్తుంది

బాదం పప్పుల్లో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ మన ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మీ పాణానికి ఏ మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే ఇది కడుపునకు సంబంధించిన సమస్యలకు కారణమవుతుంది. వీటిని ఎక్కువగా తింటే మలబద్దకం, కడుపు వాపు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. 
 

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడొచ్చు

పేగుల్లో కరిగే ఆక్సలేట్ బాదం పప్పుల్లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే ఈ ఆక్సిలేట్ మన శరీరంలో ఎక్కువైతే.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వీటిని మోతాదులోనే తినండి. 

అలర్జీ సమస్యలు (Allergy problems)

నట్స్, బాదం పప్పులు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా.. ఇవి కొందరి శరీరానికి పడవు. వీటిని తింటే అలర్జీలు వస్తుంటాయి. ఒకవేల అలెర్జీ సమస్య ఉంటే వీటిని తినడం వెంటనే మానుకోండి. అయితే కొంతమంది బాదం పప్పులను తింటే నోటి అలెర్జీ సిండ్రోమ్ సమస్య బారిన పడుతుంటారు. పెదవుల వాపు, గొంతు నొప్పి సమస్య కూడా రావొచ్చు. అందుకే బాదం పప్పులను తింటే అలెర్జీ వచ్చే వారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

click me!