Coronavirus effect: కరోనా తగ్గిందని మాస్కులను పెట్టుకోవడం లేదా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.

First Published Jun 30, 2022, 10:05 AM IST

Coronavirus effect: కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టిందని చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నా.. మాస్కులు మాత్రం ధరించడం లేదు. కేవలం ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తేనే మాస్కులు ధరిస్తున్నారు. ఇలాంటి వారు కొన్ని విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో అతలాకుతలం అయ్యాయి. అవుతూనే ఉన్నాయి. దీనిప్రభావం దేశాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. లక్షల మంది ప్రాణాలను తీసిన కరోనా.. ఎన్ని నియత్రణా చర్యలను తీసుకున్నా.. ఆగడం లేదు. ఒకటి పోతే ఇంకోటన్నట్టు రోజుకో రూపంతో ప్రజలపై విరుచుకుపడుతూనే ఉంది. అందుకే ప్రభుత్వాలు  సైతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూనే ఉన్నాయి. 

ఎన్ని వ్యాక్సిన్లు వేయించుకున్నా.. ఈ మహమ్మారి వ్యాప్తి ఆగకపోవడంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కోవిడ్ ను ఎక్కువ మొత్తంలో అడ్డుకోవడానికి మనకున్న ఏకైక అస్త్రం మాస్క్ యే నని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అందుకే ప్రభుత్వాలు మాస్క్ ను ప్రతి ఒక్కరూ ధరించాలాని ఆదేశించాయి. అయినప్పటికీ కొంతమంది మాస్క్ ను పెట్టుకోవడం లేదని ఫైన్ పద్దతిని కూడా తీసుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం కోవిడ్ కేసులు కాస్త తక్కువగానే నమోదవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలు ప్రోటోకాల్ ను సడలించాయి. దీంతో చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ కూడా మాస్క్ ను మాత్రం ధరించడం లేదు. 

కోవిడ్ ఆంక్షలను ఎత్తేసిన తర్వాత కూడా కోవిడ్ నిబంధనలు ఫాలో కావాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు ఖచ్చితంగా మాస్క్ ను ధరించాలని సూచిస్తున్నారు. అయితే ఎలాంటి ఆంక్షలు లేకుండా మాస్క్ ను ధరించాలని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. 

కరోనా వైరస్ పరివర్తన చెందుతోంది

కరోనా వైరస్ రోజు రోజుకు ఉత్తరివర్తనం చెందుతూ అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. వీటిలో 5 ఆందోళన కలిగించే వేరియంట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ వైరస్ కొత్త వేరియంట్ల అవకాశాల గురించి నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇది వేగంగా వ్యాపించొచ్చని హెచ్చరిస్తున్నారు. 

ఇలాంటి సమయంలో.. మనం దాని బారిన పడకుండా ఉండేందుకు మనముందున్న ఏకైక మార్గం మాస్కులను ధరించరించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఖచ్చితంగా మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు. ఇది ఒక వ్యక్తి ప్రాథమిక రక్షణను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

వైరస్ మొదటగా శ్వాసనాళాన్ని ప్రభావితం చేస్తుంది

కరోనా వైరస్  అనేది శ్వాసనాళ సంక్రామత్య. ఇది కొన్ని కొన్ని సార్లు శరీర ఇతర అవయవాలపై కూడా ప్రభావం చేయొచ్చు. మొదటగా వైరస్ ముక్కు లేదా నోటి  నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత శ్వాసనాళంలో చేరి సంతానోత్పత్తి చేస్తుంది. 
 

దీని సంక్రమణను ఆపాలంటే మనం ఖచ్చితంగా ముక్కును, నోటిని మూసి ఉంచాలి.  బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే ఖచ్చితంగా మాస్క్ ను వాడాలి. ముక్కును, నోటిని కప్పి ఉంచే మాస్కులనే వాడాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో తిరిగినా.. కలుషితమైన వాటిని తాకినా.. ఖచ్చితంగా శానిటైజ్ చేసుకోవడం మర్చిపోకూడదు. చేతులతో ముక్కును, నోటిని, కళ్లను తాకితే వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. 

మాస్క్ లు ట్రాన్స్ మిషన్ గొలుసును తగ్గిస్తాయి

కోవిడ్ బారిన చాలా మంది పడుతున్నారు. కానీ కొంతమందికి ఈ మహమ్మారి సోకినా.. లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. పైగా ఇలాంటి రోగుల సంఖ్య దారుణంగా పెరుగుతుంది. ఇలాంటి వారికి వైరస్ సోకినా తెలియదు. ఎందుకంటే వీరిలో కోవిడ్ లక్షణాలు ఏ మాత్రం కనిపించవు. కానీ ఈ వ్యక్తులకు వైరస్ వ్యాప్తిలో.. లక్షణాలు చూపించిన వారిలాగే ఇతరకు వైరస్ ను అంటించగలరు.  
 

ఇలాంటి సందర్భంలో మాస్కులు ఆరోగ్యకరమైన వ్యక్తులకు ప్రధాన రక్షణగా నిలుస్తాయి. వీటిని ధరిస్తేనే కోవిడ్ బారిన పడకుండా ఉంటారు. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్ములు, శ్వాస, దగ్గు వంటి ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుంది. ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేని కోవిడ్ పేషెంట్లు .. ఆరోగ్యంగా ఉన్నవారికి ఈ వైరస్ నుం అంటించకూడదంటేమాస్క్ లను తప్పనిసరిగా వాడాలి. 


మాస్క్ లు కోవిడ్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తున్నాయి: అధ్యయనాలు

బ్రిటీష్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన 2021 అధ్యయనం ప్రకారం.. మాస్కులను ఉపయోగించడం వల్ల కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 53 శాతం వరకు తగ్గిందని తేలింది. మాస్కులను ధరించడం. చేతులను శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కోవడం, సోషల్ డిస్టెన్స్ వంటి రక్షణ చర్యల వల్ల కోవిడ్ వ్యాప్తిని తగ్గించడంలో ముందుంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

JAMA నెట్‌వర్క్‌లో ప్రచురించబడిన మరో 2022 అధ్యయనం ప్రకారం.. 431 SARS-CoV-2 కేసులు, 966 కాంటాక్ట్ లో SARS-CoV-2 పరీక్ష ఫలితాలలో..  సోకిన వ్యక్తి, పరిచయం లేదా మాస్క్ ను ధరించకపోవడం వల్ల సంక్రమణ రేటు 26%కి పెరిగింది. అయితే ఈ ఇద్దరూ మాస్క్ ను ధరిస్తే సంక్రమణ రేటు 13%కి పడిపోయిందని తేలింది.
 

click me!