ఒంటి నొప్పులు తగ్గడానికి ట్యాబ్లెట్లనే వేసుకోవక్కర్లే.. వంటింట్లోని ఈ మసాలా దినుసులతో కూడా తగ్గించుకోవచ్చు..

First Published Jun 30, 2022, 11:02 AM IST

పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకోవడం ద్వారా ఒంటి నొప్పులు తగ్గినప్పటికీ.. వీటి వల్ల ఎన్నో అనారోగ్య  సమస్యలు వస్తాయి. అందుకే ఈ మందు బిల్లలను వేసుకోవడం మానేయండి. వంటింట్లో ఉండే ఈ వస్తువులతోనే శరీర నొప్పులను సులువుగా తగ్గించుకోవచ్చు. 
 

ప్రస్తుత కాలంలో ఒంటి నొప్పులతో బాధపడేవారి సంఖ్య  బాగా పెరిగిపోయింది. కదలకుండా గంటల తరబడి పనిచేయడం వంటి ఎన్నో కారణాల వల్ల ఒంటి నొప్పులు వస్తుంటాయి. కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు అంత సులువుగా తగ్గవు. అందుకే చాలా మంది డాక్టర్ ను కలవడమో లేకపోతే.. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకోవడమో చేస్తుంటారు. ఈ ట్యాబ్లెట్లు నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలిగించినా.. మన పాణానికి అస్సలు మంచివి కావు.
 

అయినా ఈ నొప్పులు మందు బిల్లలకే తగ్గుతాయనుకోవడం మన భ్రమే అవుతుంది. ఎందుకంటే వీటిని సహజ పద్దతుల్లో కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మన వంటగదిలో ఉండే కొన్ని రకాల వస్తువులతోనే ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలిగించవు. పైగా మనకెంతో మేలు చేస్తాయి కూడా. అంవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


పసుపు (Turmeric powder)

భారతీయ మసాలా దినుసుల్లో పసుపుకు ఎంతో ప్రత్యేకతుంది. దీనిని ఉపయోగించనిదే వంటలు పూర్తికావనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బయోటిక్, యాంటీ సెప్టిక్ లక్షణాలుంటాయి. ఇవి శరీరంలో ఎన్నో రోగాలను నయం చేయగలదు. నోట్లో పుండ్లు నుంచి ఉపశమనం కలిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం  పసుపులో నీళ్లు, కొబ్బరి నూనె వేసి పేస్ట్ గా తయారుచేసుకుని పుండు దగ్గర అప్లై చేయండి. అలాగే ఇది గాయాలను కూడా త్వరగా నయం చేయగలదు. ఫ్లూ నుంచి కూడా పసుపు ఉపశమనం కలిగిస్తుంది. ఒంటి నొప్పులను కూడా తగ్గించగలదు. 
 

లవంగ (Clove)

ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగించడంలో లవంగాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అలాగే వికారం. నోటి దుర్వాసన వంటి సమస్యను కూడా తగ్గిస్తుంది. లవంగాల నూనెలో ఉండే యుజెనాల్ అనే  పదార్థం రక్తాన్ని పలుచగా చేస్తుంది. అలాగే రక్తాన్ని గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. దీంతో గుండె జబ్బులు కూడా రావు. 
 

అల్లం (ginger)

కీళ్ల నొప్పుల నుంచి కండరాల నొప్పుల వరకు ఎలాంటి నొప్పులనైనా ఇట్టే తగ్గించగల శక్తి అల్లంలో ఉంటుంది. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్  నొప్పిని కలిగించే హార్మోన్ల ఉత్తత్తిని నియంత్రిస్తాయి. వికారం సమస్యను కూడా తొలగిస్తాయి. అల్లం టీ ఉదయం తాగడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి లభించడంతో పాటుగా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. 

తులసి (Basil)

తులసి ఔషదం కంటే తక్కువేమీ కాదు. దీనిని ఆయుర్వేద మందుల తయారీలో కూడా వాడుతారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. దీనిని కరోనా రోగులకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది కార్టిసాల్, ఆడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని కూడా నియంత్రించగలదు.
 

cherry

చెర్రీస్ (Cherries)

చెర్రీస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.  కీళ్ల నొప్పులు, వ్యాయామం చేయడం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలో చెర్రీలు ఎంతో తోడ్పడతాయి. వీటిని తరచుగా తినిడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే నాడీ కణాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. 
 

వెల్లుల్లి (Garlic)

వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను 10 నుంచి 15% వరకు తగ్గించగలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

click me!