తిన్న వెంటనే కూర్చోవాలా? నడవాలా? ఏది ఆరోగ్యానికి మంచిది?

First Published Dec 1, 2022, 1:50 PM IST

మనం తీసుకునే ఆహారాల ద్వారే మన శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది. తినడం సరే కానీ .. తిన్న తర్వాత చేసే కొన్ని పొరపాట్ల వల్ల అజీర్థితో పాటుగా ఎన్నో రకాల సమస్యలొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తినాలి. సాధారణంగా రోజుకు మూడు పూటలా తింటుంటారు. అయితే తిన్న తర్వాత కొన్ని పనులను చేయొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు భోజనానికి ముందు, తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. భోజనం తర్వాత కొన్ని పనులు చేస్తే.. మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత నడవడం,  పొగతాగడం, పండ్లు తినడం, నిద్రపోవడం, వెంటనే లేచి నిలబడకూడదని నిపుణులు సలహానిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే నీరు తాగొద్దని కూడా నిపుణులు చెబుతున్నారు. 

భోజనం తర్వాత కూర్చోవాలా? వద్దా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. ఆహారం తిన్న తర్వాత కూర్చోకూడదని చాలా మంది చెబుతుంటారు. అయితే తిన్న వెంటనే వాకింగ్ కు వెళ్లకూడదని ఇంకొందరు చెప్తుంటారు. అసలు భోజనం చేసిన తర్వాత కూర్చోవాలా? వద్ధా అనే దానికి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

భోజనం తర్వాత కూర్చోవడం ఎంత వరకు సరైనది?

భోజనం తర్వాత కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత 15 నుంచి 30 నిమిషాల పాటు కూర్చోవచ్చు. తిన్న వెంటనే 15 నిమిషాలు నిద్రపోతే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. కానీ ఎక్కువ సేపు కూర్చోకూడదు. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుంటే ఆరోగ్యం క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. భోజనం చేసిన వెంటనే ఎక్కువ సేపు నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

తిన్న వెంటనే ఎక్కువ సేపు  కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. భోజనం చేసి.. ఆ వెంటనే ఎక్కువసేపు కూర్చుని.. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోతే.. మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఆహారం జీర్ణం కానట్లయితే.. శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. కొవ్వు పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో వ్యాధులొచ్చే అవకాశం ఉంది. 
 

walking

భోజనం చేసిన తర్వాత నడవడం ఎంతవరకు సమంజసం?

భోజనం చేసిన వెంటనే లేవొద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తిన్నవెంటనే నడవకూడదు. తిన్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు కూర్చొనే ఉండాలి. ఆ తర్వాతే నడవాలి. నడక చాలా మంచిది. అయితే భోజనం చేసిన వెంటనే నడవడం అంత మంచిది కాదు. భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత ఆహారం బాగా జీర్ణమవుతుంటుంది. ఈ సమయంలో నడిస్తే జీర్ణవ్యవస్థకు మంచిది. 
 

walking

భోజనం తర్వాత ఎన్ని అడుగులు నడవాలి?

తిన్న తర్వాత నడిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తే మంచిగా నిద్రపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం తర్వాత 1000 అడుగులు నడవండి. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒకవేళ మీకు రాత్రిళ్లు ఆలస్యంగా పడుకునే అలవాటుంటే.. తిన్న వెంటనే పడుకోకండి. కాసేపు నడిచిన తర్వాతే నిద్రపోండి. అలాగే రాత్రి ఆలస్యంగా తినే వారు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నడిచిన తర్వాత పడుకోండి. 
 

click me!