ఈ ఒక్క ఆయిల్... మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది...!

First Published | Dec 1, 2022, 1:44 PM IST

 ఇలా చేయడం వల్ల జుట్టు చాలా సున్నితంగా, మృదువుగా, పట్టులా మారుతుంది. పొల్యూషన్ డ్యామేజ్ నుంచి రక్షించుకోగలం. సూర్యరశ్మి నుంచి కూడా కాపాడుకోగలం.

అందాన్ని పెంచుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందుకోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే... అందాన్ని పెంచుకోవడానికి మీ బ్యూటీ రొటీన్ లో కేవలం ఒక్క ఆయిల్ ని ఉపయోగిస్తే సరిపోతుందని నిపుణుులు చెబుతున్నారు. మరి ఆ ఆయిల్ ఏంటి..? ఎలా ఉపయోగించాలో ఓసారి చూద్దాం..
 

1.తల స్నానం చేయడానికి రెండు గంటల ముందు... వేడి చేసిన కొబ్బరి నూనెను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. నూనెతో సున్నితంగా మసాజ్ చేసుకున్న తర్వాత... షాంపూతో తల స్నానం చేయాలి.  ఇలా చేయడం వల్ల జుట్టు చాలా సున్నితంగా, మృదువుగా, పట్టులా మారుతుంది. పొల్యూషన్ డ్యామేజ్ నుంచి రక్షించుకోగలం. సూర్యరశ్మి నుంచి కూడా కాపాడుకోగలం.

Latest Videos


2.చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచుకునేందుకు  చాలా రకాల క్రీములను ఉపయోగిస్తూ ఉంటాం. వాటికి బదులు...కొబ్బరి నూనెను వాడటం మొదలుపెట్టాలి. చర్మాన్ని డ్రైనెస్ నుంచి కాపాడుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. అలా అని... ముఖానికి ఉపయోగించకూడదు. 

3.కొబ్బరి నూనెను మేకప్ తొలగించడానికి కూడా ఉపయోగించాలి. అంతేకాదు... చర్మం మీద పేర్కొన్న దుమ్ము, ధూళి లాంటి వాటిని కూడా తొలగించడానికి  కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది.
 

4.హెయిర్ మాస్క్ గా కూడా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. అదెలాగంటే.... 3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో...15-20 చుక్కల రోజ్ మేరీ ఆయిల్ కలపాలి. తర్వాత... ఈ రెండింటితో.... జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయాలి. బాగా మసాజ్ చేసుకున్న తర్వాత... షవర్ క్యాప్ తో కవర్ చేయాలి. గంట తర్వాత... షాంపూ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చాలా మృదువుగా మారుతుంది.
 

5.జుట్టు చిట్లు పోయినట్లుగా ఉండి..బాధపడేవారు కొబ్బరి నూనెను ఉపయోగించాలి. జుట్టు చిట్లిపోయినట్లు గా మారినప్పుడు ఆ ప్రదేశంలో... కొబ్బరి నూనెను రాయాలి.  దీని వల్ల జుట్టు మరింత బలపడుతుంది.

beauty sleep for health

6.కొబ్బరి నూనెను బాడీ స్క్రబ్ గా కూడా ఉపయోగించవచ్చు.దీని వల్ల చర్మం మెరుస్తూ...సాఫ్ట్ గా మారడానికి ఉపయోగపడుతుంది. చర్మం పై దురుద లాంటివి వచ్చినా... వాటిని తొలగించడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.

7.తలలో చుండ్రు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. వారు కూడా కొబ్బరి నూనెను ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

8.హెయిర్ రూమ్ చేయడానికి షేవింగ్ చేసే సమయంలో.... కాళ్లకు, చేతులకు కొబ్బరి నూనె రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల... చర్మం మృదువుగా మారుతుంది. స్కిన్ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది.

9.పెదాలకు సైతం కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. పెదాలను సున్నితంగా కొబ్బరి నూనెతో స్క్రబ్ చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. పెదాల పగుళ్ల సమస్య కూడా తగ్గుతుంది. ఇదే కొబ్బరి నూనెను లిప్ బామ్ గా కూడా ఉపయోగించవచ్చు.

click me!