ఆడవాళ్లు జర జాగ్రత్త.. శానిటరీ ప్యాడ్ వల్ల క్యాన్సర్, సంతాన సమస్యలు వస్తాయట..

First Published Nov 24, 2022, 3:57 PM IST

ఒకప్పుడు శానిటరీ ప్యాడ్ల ఊసే లేదు. ఇప్పుడు ఎన్నో రకాల కంపెనీ పేర్లతో శానిటర్లు ప్యాడ్లు మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ శానిటరీ ప్యాడ్ల వల్ల క్యాన్సర్ తో పాటుగా పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. 
 

ఇప్పుడైతే.. పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్లను వాడుతున్నాం.. కానీ ఒకప్పుడు వీటి జాడే లేకుండే. ఏమైనా కాటన్ క్లాత్ లనే ప్యాడ్ లాగా వాడేవారు ఆడవారు. వీటిని వేడినీళ్లలో లేదా చల్లనీటిలో ఉతికి బాగా ఎండలో ఆరేసి.. మళ్లీ వాడే వారు.  అయితే క్లాత్ వాడకం వల్ల అనారోగ్య సమస్యలు, యోని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే శానిటరీ ప్యాడ్లు వచ్చాయి.  ప్రస్తుతం క్లాత్ లను ఉపయోగించే వారు చాలా తక్కువనే చెప్పాలి. పట్టణాలే కాదు ఊర్లలలో కూడా ప్యాడ్ల వాడకం పెరిగిపోతాయింది. కానీ ఈ ప్యాడ్లు  ఆడవారి ఆరోగ్యాన్ని రిస్క్ లోకి తోస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. 

కానీ కొన్ని శానిటరీ ప్యాడ్లలో హానికరమైన రసాయనాలు ఉన్నాయట. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో మహిళలు సాధారణంగా ఉపయోగించే శానిటరీ ప్యాడ్లు కొన్ని తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. ఈ శానిటరీ ప్యాడ్లలో కనిపించే రసాయనాలు చాలా హానికరమని,  ఇవి ఆడవారిలో క్యాన్సర్, వంధ్యత్వం ప్రమాదాల్ని పెంచుతాయని నివేదిక వెల్లడించింది. 

శానిటరీ ప్యాడ్లు క్యాన్సర్, వంధ్యత్వం ప్రమాదాన్ని పెంచుతాయని న్యూ ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ నిర్వహించిన ఒక అధ్యయనంలో..  భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లు తయారు చేసిన శానిటరీ ప్యాడ్లలో క్యాన్సర్, వంధ్యత్వం ప్రమాదాన్ని పెంచే రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు భారతదేశంలో తయారైన 10 రకాల శానిటరీ ప్యాడ్లను (సేంద్రీయ మరియు అకర్బన) పరిశీలించారు. ఈ ప్యాడ్లలో థాలేట్లు, అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (వివోసిలు) ఉన్నాయని వారు కనుగొన్నారు.

ఈ శానిటరీ ప్యాడ్లను ఉపయోగించడం వల్ల చాలా మంది బాలికలు, మహిళలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం.. అన్ని నమూనాలలో కనిపించే థాలేట్లు, అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (వివోసిలు) క్యాన్సర్ కణాలను రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్యాడ్లు వంధ్యత్వానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు.

శానిటరీ ఉత్పత్తుల్లో సాధారణంగా ఉండే అనేక హానికరమైన రసాయనాలు శానిటరీ ప్యాడ్లలో కూడా ఉన్నాయి. వీటిలో కార్సినోజెన్లు, పునరుత్పత్తి టాక్సిన్స్, ఎండోక్రైన్ డిస్ట్రప్టర్లు, అలెర్జీ కారకాలు వంటి విషపూరిత రసాయనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ప్రమాదకరంగా మారతాయి.

శానిటరీ ప్యాడ్ లకు బదులుగా వేటిని ఉయోగించాలి? 

శానిటరీ ప్యాడ్ లు సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే మన దేశంలో చాలా మంది ఆడవారు పీరియడ్స్ సమయంలో వీటినే ఉపయోగిస్తారు. అయితే ఇవి కూడా ప్రమాదకరమైనవని తేలింది. శానిటరీ ప్యాడ్లను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి  పీరియడ్స్ సమయంలో ప్యాడ్ లకు బదులుగా టాంపోన్లు, మెనుస్ట్రువల్ కప్పులను ఉయోగించండి. అయితే డాక్టర్ సలహా తీసుకుని సురక్షితంగా ఉపయోగించడం మర్చిపోకూడదు. ఒకవేళ మీరు శానిటరీ ప్యాడ్లనే ఉపయోగిస్తే వాటిని తరచుగా మారుస్తూ ఉండండి. సువాసనలు వచ్చే ప్యాడ్లను ఉపయోగించకండి. ఇవి అలెర్జీలు లేద ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. యోనిని పరిశుభ్రంగా ఉంచితే.. సంక్రమ్యత ప్రమాదం తగ్గుతుంది. 
 

click me!