పీరియడ్స్ టైం లో ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే?

First Published Nov 24, 2022, 2:58 PM IST

పీరియడ్స్ సమయంలో ఆడవారు కొన్ని పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే యోని సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. 
 

పీరియడ్స్ వచ్చినప్పుడు 5 రోజులు ఆడవారికి కష్టంగా గడుస్తాయి. అయితే ఈ పీరియడ్స్ కొంతమందికి మూడు రోజులు, ఇంకొంతమందికి 5 రోజులైతే కొందరికి మాత్రం ఏడు నుంచి 8 రోజులు అవుతుంటాయి. ఈ సమయంలో ఆడవారికి మూడ్ స్వింగ్స్, తలనొప్పి, కడుపునొప్పి, అధిక రక్తస్రావం, ఒత్తిడి వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనిని నివారించడానికి లేదా తగ్గించడానికి చాలా మంది యోనికి ఎక్కువ నొప్పిని కలిగించే పనులను చేస్తుంటారు. దీనివల్ల యోని సంక్రమణ ప్రమాదం కూడా వేగంగా పెరుగుతుంది. అందుకే పీరియడ్స్ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

రతిక్రీడ

పీరియడ్స్ సమయంలో శారీరక సంబంధాలను పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ సమయంలో సంక్రామ్యత ప్రమాదం వేగంగా పెరుగుతుంది. మీకే కాదు మీ భాగస్వామికి కూడా సోకుతుంది. ఎంతగా అంటే.. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల మీరు చాలా వీక్ అవుతారు. అందుకే పీరియడ్స్ ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనకూడదు. 
 

ప్యాడ్లు,  సిలికాన్ కప్పుల వినియోగం

పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని నివారించడానికి మహిళలు ప్యాడ్ల నుంచి టాంపోన్లు, సిలికాన్ కప్పులను ఉపయోగిస్తారు. కానీ ఎక్కువ టాంపోన్ లను ఉపయోగించడం వల్ల యోని సంక్రమణకు కారణం కావచ్చు.ఇది మహిళల సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో సేంద్రీయ కాటన్ ప్యాడ్లనే ఎక్కువగా ఉపయోగించండి. 
 

పెయిన్ కిల్లర్

కొంతమంది ఆడవారికి పీరియడ్స్ సమయంలో భరించలేనంత కడుపు నొప్పి వస్తుంది. పొత్తికడుపు దిగువ భాగంలో నొప్పి ఎక్కువగా వస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి చాలా మంది ఆడవారు పెయిన్ కిల్లర్లను వేసుకుంటుంటారు. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కావు. ఇవి మహిళల్లో గుండెపోటుకు కారణమవుతాయి. ఎక్కువ మొత్తంలో పెయిన్ కిల్లర్స్ ను వేసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి బహిష్టు సమయంలో పెయిన్ కిల్లర్ లను వేసుకోకండి. 
 

కాఫీ

పీరియడ్స్ సమయంలో కాఫీని తాగితే సోమరితనం తొలగిపోయి.. హుషారుగా మారుతారు. కాఫీ వారికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఎక్కువ మొత్తంలో కాఫీని తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందే దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అంతేకాదు ఇది మిమ్మల్ని బలహీనంగా మారుస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో ఒకటి నుంచి రెండు కప్పుల కాఫీని మాత్రమే తాగండి. 
 

యోనిని తరచుగా శుభ్రపరచడం

నెలసరి సమయంలో రక్తస్రావం కావడం ఒక సాధారణ విషయం. కానీ ఈ సమయంలో యోనిని తరచుగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్యాడ్ మార్చినప్పుడల్లా యోనిని శుభ్రం చేయండి. యోనిని పదేపదే శుభ్రపరచడం, నీటితో ఒత్తిడి పెట్టడం వల్ల కూడా యోని సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. యోనిని శుభ్రం చేయడానికి మీరు సాధారణ సబ్బుకు బదులుగా సన్నిహిత వాష్ లను ఉపయోగించండి.

click me!