వంకాయ కూరను వీళ్లు అస్సలు తినకూడదు.. తిన్నారో వీళ్ల పని అంతే..?

First Published Oct 3, 2022, 6:46 AM IST

గుత్తివంకాయ వంకాయను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే అందరూ దీన్ని ఇష్టంగా తింటుంటారు.  కానీ వంకాయను కొన్ని సమస్యలున్నవారు అస్సలు తినకూడదు. 

వంకాయ కూరను ఎలా చేసినా బలే టీస్టీగా ఉంటుంది. అందుకే వంకాయంటే చాలా మందికి ఇష్టం. అందులో గుత్తివంకాయను లొట్టలేసుకుని లాగిస్తుంటారు. నిజానికి వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినప్పటికీ.. వంకాయను కొంతమంది మాత్రం అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినా సరే అలాగే తింటామంటే మాత్రం ఎన్నో సమస్యలను ఏరికోరి కొనితెచ్చుకున్న వాళ్లవుతారు. వంకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. గర్భిణిలు వంకాయను అస్సలు తినకూడదు. ఈ వంకాయలను ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం.. 

గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు

ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలున్న వాళ్లు వంకాయను తినకపోవడమే ఉత్తమం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవాళ్లు వంకాయ కూరను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒకవేళ తింటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువవుతుంది. 
 

అలెర్జీ

కొందరికి కొన్ని ఆహారాలు అస్సలు పడవు. అవి తిన్న వెంటనే అలెర్జీ వస్తుంది. ఇలాంటి వారు కూడా వంకాయ కూరను తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కూడా అలెర్జీని కలిగిస్తుంది. సమస్యను పెంచుతుంది. 

డిప్రెషన్ 

డిప్రెషన్ మనిషిని మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా దెబ్బతీస్తుంది. అయితే డిప్రెషన్ తగ్గాలని ఎవరైతే మందులు వాడుతున్నారో.. వాళ్లు వంకాయ కూరను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను ఎక్కువ చేస్తుంది. 
 

రక్తహీనత

ఆడవారిలోనే రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు కూడా వంకాయను తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వంకాయ కూర రక్తం పెరగకుండా అడ్డుపడుతుంది. 
 

కళ్ల సమస్య

ఎలాంటి కంటి సమస్యలున్నా.. వంకాయ కూరను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వంకాయలను తినడం వల్ల కంటిలో దురద, మంట సమస్యలు ఎక్కువ అవుతాయి. కంటి వాపు ఉన్నవారు కూడా వంకాయ కూరను తినకూడదు. 
 

అర్షమొలలు

అర్షమొలల బాధ మాటల్లో చెప్పలేనిది. సరిగా కూర్చోలేని, పడుకోలేని, నడవలేని పరిస్థితి వీళ్లది. అయితే పైల్స్ ఉన్నోళ్లు కూడా వంకాయను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వంకాయ కూరను తింటే పైల్స్ మరింత ఎక్కువవుతాయి. 
 

మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా వంకాయను తినకూడదు. ఎందుకంటే వంకాయలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లను పెంచుతాయి. 

click me!