Tomato Ketchup: టేస్టీగా ఉందని టొమాటో కెచప్ ను తెగ తిన్నారో మీ పని అంతే ఇక..

Published : Apr 17, 2022, 09:55 AM IST

Tomato Ketchup: టొమాటో కెచప్ టేస్టీగా ఉందని మోతాదుకు మించి తింటే మాత్రం స్థూలకాయం బారిన పడే అవకాశం ఉంది. అలాగే అలర్జీ సమస్య, ఎసిడిటీ వంటి మరెన్నో సమస్యలు వస్తాయి.    

PREV
18
Tomato Ketchup: టేస్టీగా ఉందని టొమాటో కెచప్ ను తెగ తిన్నారో మీ పని అంతే ఇక..

Tomato Ketchup: టొమాటో కెచప్ ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని పిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఈ టొమాటో కెచప్ ను మోతాదుకు మించి తినడం వల్ల స్థూలకాయం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇతర అనేక అనారోగ్య సమస్యలు  కూడా రావొచ్చు. 

28

టొమాటో కెచప్ రుచిగా అవడం కోసం దీనిలో ఉప్పు, చక్కెర, ప్రిజర్వేటివ్ లు, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లను ఎక్కువగా వాడుతారు. ఇవన్నీ మన శరీరంపై చెడు ప్రభావం చూపెడతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మార్కెట్లో దొరికే కెచప్స్ లల్లో ఫైబర్స్, ప్రోటీన్స్ మొత్తమే ఉండవు. కేవలం రుచి మాత్రమే ఉంటుంది. ఇది మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడే

38

మార్కెట్ లో లభ్యమయ్యే టొమాటో కెచప్స్ లల్లో పిండి పదార్థాలు, కొవ్వులు, కేలరీలు, ప్రోటీన్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఉప్పు, చక్కెర మాత్రం మోతాదుకు మించి ఉంటాయి. అందుకే ఈ కెచప్స్ ను ‘జీరో కేలరీలు’ గా భావిస్తారు. ఎందుకంటే ఈ కెచప్ లల్లో షుగర్, సాల్ట్ ఎక్కువ మోతాదులో ఉంటే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు మాత్రం అస్సలు ఉండవు. 

48

ఇందులో ఉండే ఉప్పు, చక్కెరలు, చెడు కొవ్వులు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తాయి. ఈ కెచప్ చిన్న పిల్లలకే కాదు పెద్దవారికి సైతం ఏ మాత్రం మంచిది కాదు. మరి ఈ టొమాటో కెచప్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

58
Tomato ketchup

స్థూలకాయం.. టొమాటో కెచప్ ను ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయం బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. దీనివల్లే బరువు విపరీతంగా పెరగుతారని చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల ఇన్సులిన్ ను కూడా తగ్గుతుంది. 

68
]

ఎసిడిటీ.. తరచుగా టొమాటో కెచప్ ను తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య బారిన పడతారు. టొమాటో కెచప్ తయారీలో ఉపయోగించే ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వల్ల గ్యాస్ట్రిక్, కడుపులో చికాకు వంటి సమస్యలు వస్తాయి. 

78

అలర్జీ సమస్యలు.. టొమాటో కెచప్ ను ఎక్కువగా తినేవారు పక్కాగా అలర్జీ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీని తయారీలో వాడే హిస్టామిన్ అనే రసాయనమే అలర్జీలకు కారణమవుతుంది. 

88

ఈ కెచప్ ను ఎక్కువగా తీసుకుంటే చర్మం పేలవంగా తయారవుతుంది. ముఖ్యంగా వీటిని వంటల్లో ఉపయోగిస్తే మాత్రం ఏరి కోరి అనారోగ్యాలను తెచ్చుకున్న వాళ్లవుతారు. కాబట్టి మార్కెట్ లో దొరికే కెచప్ ల కంటే ఇంట్లోనే టొమాటో పచ్చడి, టొమాటో సల్సా, టొమాటో సాస్ లాంటివి చేసుకుని తినండి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి హానీ జరగదు. 

Read more Photos on
click me!

Recommended Stories