ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే రోగి మనుగడ.. ఊపిరితిత్తుల క్యాన్సర్ దశ, రకంతో సహా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక రోగిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రకం.. అది ప్రారంభమైన కణ రకాన్ని బట్టి ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.
స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులలో 20 శాతం సాధారణంగా ధూమపానం వల్ల సంభవిస్తాయి.
నాన్ స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ 85% కేసులు నమోదవుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.