Possessive
చాలా మంది తమ భాగస్వామి విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటారు. వారు.. ఎవరితో మాట్లాడినా తట్టుకోలేరు. మీ పార్ట్ నర్ కూడా మీ విషయంలో పొసెసివ్ గా ఉంటారు అని అనడానికి ఈ కింది సంకేతాల సహాయంతో చెప్పేయవచ్చట.
1.పార్ట్ నర్ విషయంలో పొసెసివ్ గా ఉండేవారు.. తమ భార్యను ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారట. చేసే పనుల విషయంలో కంట్రోల్ చేయకపోయినా...వేసుకునే డ్రెస్సుల విషయంలోనో... అలా ఉండమనో... ఇలా ఉండమనో కంట్రోల్ చేస్తూ ఉంటారు.
2.తమ పార్ట్ నర్ విషయంలో పొసెసివ్ గా ఉండేవారు... ప్రైవసీ కూడా ఇవ్వరు. మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు....మీ పై కొంచెం కూడా నమ్మకం ఉంచరు. మీ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్స్, కాల్స్ అన్నీ నిత్యం చెక్ చేస్తూ ఉంటారు.
3.మరీ ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు... తమ పార్ట్ నర్ కి ప్రతి విషయంలోనూ పరిమితులు విధిస్తారు. మిమ్మల్ని ప్రతి విషయంలోనూ ఇంటికే పరిమితం చేయడం, బయటకు వెళ్లనివ్వకపోవడడం కూడా పొసెసివ్ కిందకే వస్తాయి.
ai love
4.మీరు తీసుకునే నిర్ణయాలను సైతం వారు మానిప్యూలేట్ చేయాలని చూస్తారు. మీ నిర్ణయాన్ని వారే మార్చుకునేలా మాట్లాడేస్తారు. వారు చెప్పాక.. మీ నిర్ణయాలు మీరు మార్చేసుకుంటారు.
5.ఇక కొందరు... తమ పార్ట్ నర్ విషయంలో పొసెసివ్ గా ఉండేవారు... ప్రతి నిమిషం తమ పార్ట్ నర్ తమ వెంట మాత్రమే ఉండాలని అనుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్లినా... వారు మీ వెంట ఉండాలని అనుకుంటూ ఉంటారు.
6.వారికంటూ ప్రత్యేకంగా ఎలాంటి లైఫ్ ఉండదు... మీ వెంటే వారు పరిగెడుతూ ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు..? ఏం చేయకూడదు.. ఇలా ప్రతి నిమిషం మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు.
7.మీకు గతంలో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ లాంటివారు ఎవరైనా ఉంటే... వారిని చూసి కూడా జెలస్ ఫీలౌతూ ఉంటారు. వారు పేరు మీ నోటి నుంచి వచ్చినా తట్టుకోలేరు.