చలికాలంలో ఆవనూనెతో బాడీ మసాజ్ చేస్తే ఇన్ని లాభాలున్నాయా?

First Published Oct 20, 2022, 1:04 PM IST

ఆవనూనెను వంటల్లో కూడా ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో ఆవనూనెతో బాడీ మసాజ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

ఆవనూనెలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ నూనెలో ఒమేగా  3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ నూనె మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆవనూనెతో అప్పుడప్పుడు బాడీ మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి తెలుసా.. అవేంటంటే.. 

శరీరాన్ని వేడి చేస్తుంది

అవనూనెతో బాడీ మసాజ్ చేస్తే.. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఆవనూనెలో బాడీ టెంపరేచర్ ను పెంచే గుణాలుంటాయి. ఆవనూనెతో మసాజ్ చేసుకుంటే చలికాలంలో చలిని తట్టుకునే శక్తి లభిస్తుంది. 

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది

ఆవనూనె శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో రక్తం, పోషణ శరీరంలోని ఇతర అవయవాలకు బాగా చేరుతాయి. నరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
 

 కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది 

కండరాలు, కీళ్లకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి కూడా ఆవనూనె ఉపయోగపడుతుంది. ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.  క్రమం తప్పకుండా ఆవనూనెతో ఎముకలు, కండరాలు, కీళ్లకు బాగా మసాజ్ చేస్తే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ఎముకలను బలంగా ఉంచడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు.
 

శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది

ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. 
 

పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఆవనూనెతో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
 


ఆవనూనెతో మసాజ్ ఎలా చేయాలి?

ముందుగా ఆవనూనెను వేడి చేయండి. అవసరమైతే ఈ నూనెలో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేడి చేయండి. నూనె బాగా వేడి అయిన తర్వాత చల్లారనివ్వండి.గోరు వెచ్చగా ఉన్నప్పుడు నూనెతో మొత్తం శరీరాన్ని బాగా మసాజ్ చేయండి. అయితే ఈ మసాజ్ ఉదయం పూట చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. 

click me!