మన దేశంలో చాయ్ ప్రియులు చాలా మందే ఉన్నారు. 64 శాతం మంది భారతీయులు రెగ్యులర్ గా టీ తాగుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంటే మన దేశంలో దాదాపుగా ప్రతి ఇల్లు రోజుకు కనీసం ఒక కప్పు టీని తయారుచేస్తుందన్న మాట. అయితే టీ లో చాలా రకాలే ఉన్నాయి. అల్లం టీ, బాదం టీ, బ్లాక్ టీ, మసాలా టీ అంటూ రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి. నీళ్లు, టీ ఆకులు, చక్కెర, పాలు, అల్లం, ఇతర మసాలు దినుసులతో నచ్చినట్టుగా టీని తయారుచేసుకుని తాగుతుంటారు. నిజానికి టీ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.