రోజూ హస్త ప్రయోగం.. ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

First Published Dec 25, 2022, 3:59 PM IST

లైంగిక ఆనందాన్ని అందించడంతో పాటుగా.. రెగ్యులర్ గా హస్త ప్రయోగం చేయడం వల్ల నిద్ర మెరుగ్గా పడుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. 
 

హస్త ప్రయోగాన్ని చాలా మంది అదో పెద్ద తప్పు అన్నట్టుగానే చూస్తారు. కానీ చాలా మంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి ఇది ఆరోగ్యకరమైన చర్య. లైంగికంగా చురుగ్గా ఉండటానికి ఇది సురక్షితమైన మార్గం. అయితే రోజూ హస్త ప్రయోగం చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని కొంతమంది భావిస్తుంటారు. కానీ దీనిలో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. హస్త ప్రయోగం వల్ల ఆనందంగా ఉంటారు. అలాగే ఎన్నో మానసిక, శారీరక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఇది సురక్షితమైన మార్గాలలో ఒకటని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ప్రతిరోజూ హస్త ప్రయోగం చేస్తారు. ఇంకొంత మంది వారానికి ఒకసారి చేస్తారు. మరికొందరు సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చేస్తారు. కొందరైతే మొత్తమే చేయరు. ఇది వ్యక్తిగత ఎంపిక. అవగాహనతో చేస్తే ఇది శరీరంలో ఫీల్ గుడ్ వైబ్స్ ను రిలీజ్ చేస్తుంది. అసలు రోజూ హస్త ప్రయోగం చేస్తే ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

హస్త ప్రయోగం అంటే ఏమిటి?

హస్త ప్రయోగాన్నే స్వయంతృప్తి  అంటారు. శారీరకంగా తాకడం వల్ల దీన్ని అనుభవిస్తారు. ఇందులో జననేంద్రియాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఏదైనా చర్య హస్త ప్రయోగంగా పరిగణించబడుతుంది. అత్యంత సాధారణంగా జననేంద్రియ ప్రాంతాలను అంటే.. మగవారిలో పురుషాంగం, ఆడవారిలో క్లిటోరిస్ ప్రాంతాన్ని తాకుతారు. అంటే ఆడవాళ్లు  యోనిలో చూపుడు వేలు లేదా మధ్యవేలును వేలు లేదా ఏదైనా వస్తువును చొప్పించి జీ స్పాట్ ను ప్రేరేపిస్తారు. ఇది ఉద్వేగానికి దారితీస్తుంది.
 

క్రమం తప్పకుండా హస్త ప్రయోగం చేస్తే సురక్షితమేనా?

రెగ్యులర్ గా హస్త ప్రయోగం చేయడం వల్ల శరీరం, మనస్సుపై హానికరమైన ప్రభావం పడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ హస్త ప్రయోగం ఆరోగ్యానికి చెడ్డదని సూచించే అధ్యయనాలేమీ లేవు. రోజూ లేదా రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు హస్తప్రయోగం చేయడం వల్ల ఎలాంటి హాని జరగదని నిపుణులు అంటున్నారు. లైంగిక ఆనందాన్ని అనుభవించడానికి, మీ స్వంత శరీరంతో కనెక్ట్ కావడానికి ఇది సురక్షితమైన మార్గం అంటున్నారు నిపుణులు. 
 

క్రమం తప్పకుండా హస్త ప్రయోగం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది లైంగిక ప్రయోజనాలను కూడా కలిగిస్తుందట. లైంగికంగా ఎక్కువ సంతృప్తి చెందగానికి ఇది గొప్ప మార్గం.  ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు వివరించాయి. 


పీరియడ్స్ సమయంలో ఆడవాళ్లు హస్త ప్రయోగం చేయడం వల్ల తిమ్మిరి, మానసిక స్థితిలో మార్పులు, కడుపు ఉబ్బరం, కోరికలు మొదలైన ఋతు సిండ్రోమ్ లక్షణాలను తగ్గించవచ్చు. హస్త ప్రయోగం వంటి ఒంటరి కార్యకలాపాలతో ప్రెగ్నెన్సీ లేదా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. అయితే పరిశుభ్రమైన పరిస్థితుల్లో, సౌకర్యవంతమైన, ప్రైవేట్ స్థలంలోనే హస్త ప్రయోగం చేయాల్సి ఉంటుంది. 
 

masturbation

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోని వివిధ ప్రాంతాలలో హస్త ప్రయోగం పట్ల ఏండ్ల నుంచి చెడు అభిప్రాయాలు ఉన్నాయి. దీని వల్ల వీర్యం కోల్పోవడం, బలహీనత, ఒంట్లో శక్తిని కోల్పోతారని చాలా మంది నమ్ముతారు. నిజానికి హస్త ప్రయోగం పట్ల ఉన్న ఈ అభిప్రాయాలను వట్టి అపోహలేనంటున్నారు నిపుణులు. 

click me!