రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉండాలంటే వీటిని తినండి..

First Published Dec 25, 2022, 2:57 PM IST

షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. 

diabetes diet

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య దారుణంగా పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం.. ప్రస్తుత కాలంలో చాలా మంది రక్తంలో చక్కెరను పెంచే అలవాట్లనే కలిగున్నారు. నిజానికి డయాబెటీస్ ను పూర్తిగా నయం చేయలేం. కానీ నియంత్రణలో మాత్రం ఉంచుకోవచ్చు. అది కూడా మెరుగైన జీవన శైలితో. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మన ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు పరిమిత ఆహారాన్ని అనుసరించాల్సి ఉంటుంది. కానీ ఇదేమంత కష్టమైంది కాదు. జీవన శైలిలో కొన్ని మార్పులు, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే సులువుగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించొచ్చు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుకుందాం..  

diabetes diet

పోహాను రెగ్యులర్ తినే అలవాటుందా? అయితే  ఇప్పటి నుంచి దాన్ని తినడం మానేయండి. దీనికి బదులుగా గ్రీన్ పెసరపప్పు చిల్లాను తినండి. ఎందుకంటే దీనిలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులువు. 

Diabetes

 నిజానికి పిండి పదార్థాలు మధుమేహులకు అంత మంచివి కావు. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. వీటికి బదులుగా తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉన్న జొన్న రొట్టెలను తినండి. జొన్న రొట్టెలు డయాబెటీస్ నియంత్రిస్తుంది.  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది చాలా సులువుగా కూడా అరుగుతుంది. 

diabetes

డయాబెటీస్ పేషెంట్లు తృణధాన్యాలు లేదా గ్రానోలాకు బదులుగా..  మార్కెట్లలో లభించే గుడ్లు లేదా ధాన్యం లేని గ్రానోలా రకాలను ఎంచుకోండి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. 

పండ్లు సహజంగా తీయగా ఉంటాయి. కానీ కొన్ని పండ్లు మాత్రం వేరే పండ్ల కన్నా.. ఇంకొంచెం తియ్యగా.. షుగర్ కంటెంట్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి. అందుకే అరటి వంటి షుగర్ ఎక్కువగా ఉండే పండ్లలకు గింజలను జోడించి తినండి.

diabetes

కృత్రిమ స్వీటెనర్లను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. ఒకవేళ మీ భోజనానికి కొంత తీపిని జోడించాల్సి వస్తే మాంక్ ఫ్రూట్ వంటి సహజ స్వీటెనర్లను ఉపయోగించండి. అయినా వాటిని కూడా మితంగానే ఉపయోగించాలి. 

డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచడానికి  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీకు బాగా సహాయపడతాయి. కాబట్టి మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

click me!