మీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని చెప్పే లక్షణాలు ఇవే.. ఏం తినాలంటే..!

First Published Aug 23, 2022, 9:54 AM IST

ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే.. మనం ఎలాంటి రోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉన్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కనిపించని భయంకరమైన వైరస్ లతో యుద్దం చేస్తున్నాయి. ఒకవైపు కరోనా, ఇంకోవైపు మంకీపాక్స్.. మరోవైపు టమాటా ఫ్లూ..ఈ మూడు కలిసి ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇవీ చాలవన్నట్టు సీజనల్ల వ్యాధులు కూడా దారుణనంగా వ్యాపిస్తున్నాయి. అందుకే ఇలాంటి సమయంలో మనం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే బలమైన రోగ నిరోధక వ్యవస్థతోనే మనం ఎన్నో వైరస్ ల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకుంటాం. కానీ కొంతమంది బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉండి.. ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే.. 

రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే కనిపించే లక్షణాలు

తిన్నా కూడా నీరంగానే కనిపించడం

ఎక్కువగా అలసట కలగడం

జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు తరచుగా రావడం

చిన్న దెబ్బలు సైతం తొందరగా మానకపోవడం

బద్దకంగా, ఏ పని చేయాలనిపించకపోవడం

తిన్న ఫుడ్ కూడా తొందరగా జీర్ణం కాకపోవడం

ఒత్తిడి బారిన పడటం

పైన పేర్కొన్న లక్షణాలు మీలో కనిపించినట్టేతే మీరు మీ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అర్థం. లేదంటే వీటితో పాటుగా ఎన్నో రోగాలు మీకు చుట్టుకునే ప్రమాదముంది. ముఖ్యంగా కంటినిండా నిద్రపోతూ పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే నిద్రతక్కువగా పోయినా.. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. 
 

ఏం తినాలి

కొన్ని రకాల మసాలా దినుసులు కూడా ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. అల్లం, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు వంటి వాటిని రోజూ తీసుకోవాలి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 

గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చేపలు, చెకెన్ కూడా మన ఆరోగ్యానికి మంచివే. ఈ మూడూ కూడా ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా చేయడానికి సహాయపడతాయి. అయితే వీటిలో రోజూ ఒక గుడ్డును తినొచ్చు. అయితే చికెన్, ఫిష్ లను మాత్రం రోజూ తినడం  మంచిది కాదు. 

మొలకెత్తిన గింజలు, బాదం పప్పులు, వాల్ నట్స్, జీడి పప్పులు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటి వాటిని తింటే కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 
 

పాలు, పాల ఉత్పత్తులను తీసుకున్నా.. శరీరానికి శక్తి లభించడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే ఆకు కూరలు కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇందుకోసం తోటకూర, పాలకూరను రెగ్యులర్ గా తినాలి. 

స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇక శరీరానికి అవసరమైన విటమిన్ డి ఎక్కువగా ఉండే  ఫుడ్స్ ను తింటూ కాసేపు ఉదయం ఎండలో ఉండాలి. ముఖ్యంగా మీ శరీరంలో పోషకాల లోపం ఉండకూడదు. 

click me!