జీవిత భాగస్వామిని మోసం చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి....!

First Published Oct 6, 2022, 3:29 PM IST

వారికి తెలియకుండా.. మరొకరితో రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే... మీ మీ భాగస్వామిని మోసం చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి.

cheating

ఈ రోజుల్లో  చాలా మంది తమ జీవిత భాగస్వాములను  మోసం చేస్తున్నారు.తమ పార్ట్ నర్ మీద ప్రేమ, ఉత్సాహం తగ్గిపోయినట్లు భావిస్తూ ఉంటారు. దీంతో... వారికి తెలియకుండా.. మరొకరితో రిలేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే... మీ మీ భాగస్వామిని మోసం చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి.

దాదాపు.. చాలా మంది పెళ్లైన కొంత కాలానికి మోజు తగ్గిపోయిందని పరాయి వ్యక్తి మోజులో పడుతూ ఉంటారు. మీ పార్ట్ నర్ మీద బోరు కొడితే...మరో వ్యక్తి మోజులో పడకుండా... మీ సెక్స్ లైఫ్ ని స్పైసీగా మార్చుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ లైఫ్ బెటర్ గా ఉంటే.. మరొకరి మోజులో పడాల్సిన అవసరం ఉండదు కదా. మీ సెక్స్ లైఫ్ ని ఆసక్తికరంగా మర్చుకునేది మీ చేతుల్లోనే ఉంటుంది. మరీ కాదంటే... ఏవైనా సెక్స్ టాయ్స్ వాడితే సరిపోతుంది.


పెళ్లి చేసుకున్నంత మాత్రన మంచి భాగస్వామి అయిపోరు. మీరు, మీ భాగస్వామి తో కలిసి అన్ని పనులు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇద్దరూ కలిసి అన్ని పనులు చేసుకోవడం వల్ల.. ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అనే భావన కలగదు. ఇద్దరికీ ఒకకరి కష్టం మరొకరికి తెలుస్తుంది. మీ పార్ట్ నర్ అప్పుడప్పుడు  చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి. ఇంటిని అందంగా అలంకరించుకుంటూ ఉండండి. మీరు చిన్న చిన్న సహాయం చేయడం వల్ల.. వారు మీ ప్రేమ చూపిస్తారు. అప్పుడు.మీకు మరొకరితో రిలేషన్ పెట్టుకోవాలనే ఆలోచన రాదు. 

ఇక కొందరు.. తమ జీవితంలోకి పిల్లలు రావడం వల్ల  దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. మహిళలు.. పిల్లల పెంపకంలో బిజీగా మారడం వల్ల.. భర్త మరొకరి మోజులో పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు.. నెలకొకసారైనా మీ పిల్లలను మీ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి.. మీ పార్ట్ నర్ సరదాగా గడపడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. మరొకరి మోజులో పడి.. భాగస్వామి కి ద్రోహం చేయాలనే ఆలోచన రాదు. 

అంతేకాకుండా.. పిల్లల పనులను కూడా పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆమె ఫీడ్స్, మీరు హోంవర్క్ చూసుకోండి. మీ భార్య కనీసం ఒక గంట లేదా రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకునేలా మీ బిడ్డతో మీరు ఆడుకోవాలి. అప్పుడు ఆమె భారం కాస్త తగ్గించినవారు అవుతారు.

సంతోషకరమైన వివాహానికి కమ్యూనికేషన్ కీలకం. ఏదో మిస్ అయినట్లు మీ భాగస్వామికి చెప్పండి. మీతో ఆమె సమస్యలను వినడానికి ఓపెన్‌గా ఉండండి. మీరు మీ సమస్యలను ఆమెకు చెప్పండి. ఏదైనా సమస్య ఉంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోండి. 

click me!