చలిలో కూడా చెమటలు పడుతున్నాయా? ఈ రోగాలే కారణం కావొచ్చు.. చెక్ చేయించుకోండి..

Published : Nov 18, 2022, 11:51 AM IST

శరీరం నుంచి చెమట బయటికి రావడం చాలా సహజం. ఎక్కువ ఉబ్బరిచ్చినప్పుడో, శారీరక శ్రమ ఎక్కువైనప్పుడో చెమట పడుతుంది. కానీ ఎముకలను కొరికే చలిలో కూడా చెమటలు పడుతుంటాయి కొందరికి.. దీనికి కారణం ఈ సమస్యలే... 

PREV
17
చలిలో కూడా చెమటలు పడుతున్నాయా? ఈ రోగాలే కారణం కావొచ్చు.. చెక్ చేయించుకోండి..

శరీరం బాగా అలసిపోయి చెమటలు బయటకు వచ్చినప్పుటే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతుంటారు. మన శరీరం నుంచి చెమట బయటకు వెళ్లిపోతేనే ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మన బాడీలో ఉండే విషపూరిత పదార్థాలు చెమట ద్వారా బయటకుపోతాయి. జిమ్ లో కసరత్తులు చేసినప్పుడు, బాగా ఉరికినప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు లేదా ఎండలో ఎక్కువ సేపు గడిపినప్పుడు చెమట బాగా పడుతుంది. అయితే కొందరికి వణికే చలికాలంలో కూడా చెమటలు పడుతుంటాయి. కారణం వారి శరీరం కొన్ని రోగాల బారిన పడటమే. 
 

27

శీతాకాలంలో చెమట పట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇది కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతమంటున్నారు నిపుణులు. మన శరీర సగటు ఉష్ణోగ్రత 98 నుంచి 98.8 ఫారెన్ హీట్ వరకు ఉంటే.. అది సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ శరీర ఉష్ణోగ్రత 100 కంటే ఎక్కువగా ఉన్నట్టైతే జ్వరం వచ్చిందని అంటారు. కానీ మన శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు సంకేతం. 

37

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. శీతాకాలంలో అధిక చెమట మన శరీర ఈస్ట్రోజెన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా శీతాకాలంలో ప్రతి ఒక్కళ్లూ వేడి వేడి పదార్థాలను తినడానికే  ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే వేడి వేడి ఆహారాన్ని తినేటప్పుడు చెమట పట్టడం సర్వ సాధారణం. కానీ ఈ చెమటకు కారణమేమీ లేకుండా కనిపించినా.. విపరీతంగా చెమట పడుతున్నా.. వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. అసలు శీతాకాలంలో చెమట పట్టడం ఏయే రోగాలకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం... 
 

47

తక్కువ రక్తపోటు

చలికాలంలో కూడా చెమటలు పట్టడం తక్కువ రక్తపోటుకు సంకేతం కావచ్చు. మీకు తెలుసా బీపీ తక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. చల్లని వాతావరణంలో రక్తపోటు తక్కువగా ఉంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. దీంతో ధమనులు మూసుకుపోవడం ప్రారంభమవుతాయి. ఫలితంగా చెమట పడుతుంది. హృదయ స్పందన రేటు కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. చెమట పట్టడంతో పాటుగా హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 
 

57

హైపర్ హైడ్రోసిస్ 

హైపర్ హైడ్రోసిస్ అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి వల్ల కూడా విపరీతమైన చెమట పడుతుతందది. ఈ వ్యాధిలో రోగి ముఖంతో పాటు అరచేతులు, పాదాల్లో చెమట విపరీతంగా పడుతుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి చెమట పట్టడం చాలా అవసరం. కానీ అరచేతులు, పాదాల్లో విపరీతంగా చెమట పడుతున్నట్టైతే..  అతను హైపర్ హైడ్రోసిస్ తో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవాలి.
 

67

షుగర్ లెవెల్స్ తగ్గడం

మన శరీరంలో షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉండటం చాలా అవసరం. ఇవి ఎక్కువైనా సమస్యే.. తక్కువైనా సమస్యే.. మన శరీరంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు 1 డెసిలిటర్ రక్తంలో 70 నుంచి 100 మి.గ్రా చక్కెర ఉంటే.. అది ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. చక్కెర స్థాయి దీనికంటే తక్కువగా ఉంటే చెమట విపరీతంగా పడుతుంది. 
 

77

బహిష్టు సమయంలో 

40 సంవత్సరాల వయస్సు దాటిన ఆడవారిలో రుతుస్రావం ఆగిపోయే అవకాశం ఉంది. కొంతమంది మహిళలకు 40 ఏడ్ల వయసులో రుతివిరతి వస్తే.. మరికొంతమంది ఆడవారికి 50 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా పీరియడ్స్ అవుతూనే ఉంటాయి. మహిళకు 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి..  శీతాకాలంలో కూడా చెమట పట్టినట్టైతే ఆమెకు రుతువిరతి ప్రారంభమైందని అర్థం. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్లే ఇలా చెమట పడుతుంది. 

ఊబకాయం 

ఊబకాయం ఉన్నవారికి కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఊబకాయులకు శీతాకాలంలో కూడా చెమట పడుతుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories