గుమ్మడి గింజలు చిన్నగా ఉన్నా.. వీటిలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. క్రమం తప్పకుండా మోతాదులో వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
27
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు ఇది ఎముకలను, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
37
చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
గుమ్మడి గింజల్లో ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
47
రక్తంలో ఇనుముు స్థాయిలను పునరుద్దరిస్తుంది
గుమ్మడి గింజలు మన శరీరంలోని రక్తంలో ఐరన్ స్థాయిలను పునరుద్దరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
57
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
ఈ విత్తనాలు జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో సహాయపడతాయి. వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేందుకు సహాయపడుతుంది.
67
జింక్ పవర్ హౌస్
వీటన్నింతో పాటుగా గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. శరీర అవయవాల పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇది చర్మ సంరక్షణగా పనిచేస్తుంది. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. సంతానోత్పత్తి సమస్యలను పోగొడుతుంది.
77
గుమ్మడి గింజను ఇలా తీసుకోవచ్చు
వీటిని పెరుగు, పండ్లతో కలిపి తినొచ్చు. స్మూతీగా గా కూడా తీసుకోవచ్చు. వీటిని కుకీలు, రొట్టెల్లో కూడా ఉపయోగించొచ్చు. వీటిని ఏ రూపంలో ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.