కనుక ఎప్పుడు చేసుకునే సేమియా పాయసానికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేయండి. ఈ పాయసం తయారీ విధానం కూడా సులభం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ హెల్తీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం (Pesarappu Saggubiyyam Payasam) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: సగం కప్పు పెసరపప్పు (Moongdal), సగం కప్పు సగ్గుబియ్యం (Saggubiyyam), అర లీటర్ పాలు (Milk), పావు కప్పు నెయ్యి (Ghee), ఒకటిన్నర కప్పు బెల్లం (Jaggery) తరుగు, చిటికెడు యాలకుల పొడి (Cardamom powder), పది బాదం (Almond), పది జీడిపప్పు పలుకులు (Cashew nuts), కొన్ని ఎండుద్రాక్షలు (Raisins).
తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని గంటపాటు నానబెట్టుకోవాలి (Soak). ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పెసరపప్పు వేసి నూనె లేకుండా తక్కువ మంట (Low flame) మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పును రెండుసార్లు నీటిలో శుభ్రపరచుకొని తరువాత కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్లు, ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి తక్కువ మంట మీద మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు, ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి వేడిచేసుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు (While boiling) అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి తక్కువ మంట మీద బాగా ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన (Well cooked) తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
కుక్కర్ మూడు విజిల్ లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ఆవిరి తగ్గాక మూత తీసి ఉడికించుకున్న పెసరపప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న పెసరపప్పులో ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని, ఒక గ్లాస్ నీళ్లు (Water) పోసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాయసం బాగా ఉడుకుతున్నప్పుడు చిటికెడు యాలకుల పొడి వేయాలి. యాలకుల పొడి పాయసానికి మంచి సువాసనను (Aroma) అందిస్తుంది.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తరువాత జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై (Fry) చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను పాయసంలో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసాన్ని చల్లార్చుకోవాలి. పాయసం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న అర లీటరు పాలు వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన హెల్తీ (Healthy) పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ.