Hair Care Tips: డ్రై షాంపూలను వాడుతున్నారా? దీనివల్ల జుట్టు ఎంత దెబ్బతింటుందో తెలుసా..

Published : Jul 25, 2022, 01:58 PM IST

Hair Care Tips: డ్రై షాంపూలను వాడే వారు చాలా మందే ఉన్నారు. కానీ వీడిని యూజ్ చేయడం వల్ల జుట్టు ఎంతో దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
 Hair Care Tips: డ్రై షాంపూలను వాడుతున్నారా? దీనివల్ల జుట్టు ఎంత దెబ్బతింటుందో తెలుసా..

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ  బిజీలైఫ్ నే లీడ్ చేస్తున్నారు. అందుకే సమయం, శరీరక శ్రమ తక్కువగా ఉండే పనులనే చేస్తున్నారు. వీరికి అనువుగా మార్కెట్ లో  వివిధ రకాల ప్రొడక్ట్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒకటి డ్రై షాంపూలు ఒకటి. డ్రై షాంపూతో స్ప్రే చేయడం వల్ల జుట్టుకున్న జిడ్డంతా పోతుంది. కానీ దీని యూజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

25

స్కాల్ప్ మురికిగా మారుతుంది

డ్రై షాంపూలను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు నెత్తికి అతుక్కుపోతాయి. అంతేకాదు ఇది నెత్తిమీద మురికి పేరుకునేకులా చేస్తుంది. దీంతో నెత్తిమీద దురద పెడుతుంది. ఈ డ్రై షాంపూలను ఉపయోంగిన కొన్ని గంటల్లో లేదా ఒక రోజు తర్వాత నెత్తిమీద చుండ్రు లేదా  తెల్లని పౌడర్ లాంటి పొర కనిపిస్తుంది. ఇది హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. 
 

35

మాడుపై దురద

ప్రతి వస్తువు ఎలా అయితే ప్రయోజనాలను కలిగి ఉంటుందో నష్టాలను కూడా కలిగిస్తుంది. ఈ డ్రై షాంపూలను యూజ్ చేసిన తర్వాత మాడుపై పౌడర్ లాంటి పొర ఏ ర్పడుతుంది. ఇది దురదకు దారితీస్తుంది. దీంతో జుట్టుకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. 
 

45

జుట్టు రాలడం

డ్రై షాంపూలో కెమికల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టుపై ఉండే నేచురల్ సెబమ్ ను శోషించుకుంటాయి. దీనివల్ల నెత్తి ఎర్రబడుతుంది. డ్రై షాంపూలో ఉండే హానికరమైన కెమికల్స్ జుట్టు రాలడానికి దారితీస్తాయి. 

55

చుండ్రు సమస్య

డ్రై షాంపూ ను ఉపయోగించినప్పుడు దాని రేణువులు వెంట్రుకల్లో అలాగే ఉంటాయి. దీనివల్ల నెత్తిలో చుండ్రు ఏర్పడుతుంది. అందులోనూ డ్రై షాంపూలను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు గరుకుగా మారుతాయి. ముఖ్యంగా ఇది నెత్తిమీద ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories