పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..?

Published : Oct 15, 2022, 01:55 PM IST

ఉల్లిలేని కూర దాదాపుగా ఉండదేమో కదా.. ఇది రుచిగా ఉండటమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందులోనూ పచ్చిఉల్లిపాయ తింటే ప్రమాదకరమైన రోగాల ప్రమాదం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. 

PREV
18
 పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..?
onion

ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎక్కువగా ఇష్టపడే కూరగాయల్లో ఉల్లి ఒకటి. సాత్విక ఆహారాన్ని తీసుకునే కొంతమంది మాత్రమే ఉల్లిపాయలను తినరు. కానీ నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కళ్లు ఉల్లిని ఇష్టంగా, ఎక్కువగా తింటుంటారు. ఉల్లిపాయలను చాలా హోటళ్లలో సలాడ్లుగా కూడా వడ్డిస్తారు. కానీ దీని ఘాటైన వాసన కారణంగా చాలా మంది దీన్ని తీసుకోరు. 

28

యుఎస్డిఎ ప్రకారం.. ముడి ఉల్లిపాయల్లో ఫైబర్, ప్రోటీన్, కేలరీలు, కాల్షియం, ఇనుము, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు పచ్చి ఉల్లిపాయల్లో కూడా అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, అసెప్టిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి.
 

38

మధుమేహానికి మేలు చేస్తుంది

ఎన్సీబీఐలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఉల్లిపాయల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. అందుకే ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మీకు షుగర్ సమస్య ఉంటే.. పచ్చి ఉల్లిపాయలను రోజూ కొంత మొత్తంలో తినండి.

48

క్యాన్సర్ నుంచి కాపాడుతుంది

ఒక పరిశోధన ప్రకారం.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్, ఆంథోసైనిన్ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి.  ఇవి మీ శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. ఉల్లిపాయలు తినడం వల్ల రొమ్ము, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

58

ఉల్లిపాయలు గుండెకు ఆరోగ్యకరమైనవి

ఉల్లిపాయలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఉల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

68
onion

బలమైన ఎముకలు

ఉల్లిపాయలను తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గాలంటే పచ్చి ఉల్లిపాయను తినాలని నిపుణులు సలహానిస్తున్నారు. బోలు ఎముకల వ్యాధి వయస్సు మీద పడుతుంటే వస్తుంది. ఉల్లిపాయను తినడం వల్ల శరీరంలోని ఎముకలు దృఢంగా అవుతాయి. 

78

మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి ఔషదంలా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. అంతేకాదు ఇది మొత్తం కడుపును కూడా శుభ్రపరుస్తుంది. కాబట్టి పచ్చి ఉల్లిపాయ సలాడ్ లేదా మీకు నచ్చిన ఆహారంలో వీటిని తప్పకుండా తినండి. 
 

 

88

సెక్స్ ను మెరుగుపరుస్తుంది

ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి లైంగిక శక్తిని పెంచే లక్షణం.  ఉల్లిపాయలు పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని పెంచుతాయి. దీంతో సంతానోత్పత్తికి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి పచ్చి ఉల్లిపాయలు తినండి. సంతోషకరమైన లైంగిక జీవితాన్ని గడపండి.

Read more Photos on
click me!

Recommended Stories