అలాగే పుష్కలంగా నీటిని, ఇతర హెల్తీ ద్రవాలను తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. వేడి వాతావరణంలో నివసిస్తుంటే రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బలవర్థకమైన ఆహారాల ద్వారా తగినంత మొత్తంలో కాల్షియాన్ని తీసుకోవాలి. ఎందుకంటే తక్కువ కాల్షియాన్ని తీసుకోవడం వల్ల మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు పెరుగుతాయి. ఉప్పు, మాంసాలను ఎక్కువగా తీసుకోకూడదు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ది చేసిన చక్కెరలు, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. అప్పుడే కిడ్నీ స్టోన్స్ తొందరగా తగ్గిపోతాయి.