పీరియడ్ ఫ్లూతో పోరాడటానికి చిట్కాలు
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు భోజనం చేయండి.
హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బీన్స్ వంటి తృణధాన్యాల ఉత్పత్తులనే తినండి.
ఉప్పు, కెఫిన్, ఆల్కహాల్ వంటివి హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి. అందుకే ఇలాంటి ఆహారాలను, పానీయాలను తక్కువగా తీసుకోండి.
మీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది పిఎంఎస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
మంచి వ్యాయామం, హైడ్రేషన్ పీరియడ్స్ సమయంలో మీ శరీరం చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
విటమిన్ డి ని పొందడానికి సూర్యకాంతిలో కొద్ది సేపు ఉండండి.
సంక్రమణతో పోరాడటానికి, పీరియడ్ ఫ్లూను తగ్గించుకోవడానికి, శరీర సామర్థ్యాన్ని పెంచడానికి విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి.