అరటి ఆకులో భోజనం.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో..!

First Published Dec 27, 2022, 3:41 PM IST

పెళ్లిళ్లలకు, పేరంటాకు కొంతమంది అరటి ఆకులో భోజనం వడ్డిస్తారు. నిజానికి అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

దక్షిణ భారతదేశంలో ప్లేట్ నిండా తీరొక్క వంటలు నోరూరిస్తుంటాయి. మీకు తెలుసా? దక్షిణ భారత ఆహారాలు ప్రపంచ ఆహార ప్రియలను బలే నచ్చుతాయి. అయితే  ఈ కమ్మని వంటకాలను అరటి  ఆకులో  సాంప్రదాయ పద్దతిలో వడ్డిస్తుంటారు. నిజానికి అరటి ఆకుల్లో వీటిని తినడం వల్ల ఈ వంటల రుచి మరింత పెరుగుతుంది. దక్షని భారతదేశంలో థాలిలోని అన్ని రకాల వంటకాలను అరటి ఆకులోనే వడ్డిస్తారు. ఎందుకని మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి అరటి ఆకులో వడ్డించడం వల్ల వంటల రుచి పెరగడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

'జర్నల్ ఆఫ్ ఎథ్నిక్ ఫుడ్స్'లో ప్రచురించిన ఒక అధ్యయనం.. అరటి ఆకులను లోహ పాత్రలు ఉనికిలోకి రావడానికి ముందునుంచే ఉపయోగించారని వెల్లడించింది. అరటి ఆకులు మందంగా, పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. అందులోనూ ఇవి ఆహారం పెట్టినా చిరిగిపోవు. అసలు అరటి ఆకుల్లో తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వ్యాధుల నుంచి రక్షిస్తుంది

అరటి ఆకులలో సహజంగా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఒక రకమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే సాధారణ అనారోగ్యాలను నివారించడానికి కూడా సహాయపడుతాయి. ఆకులో వడ్డించిన ఆహారాన్ని తినడం వల్ల మన శరీరం పాలీఫెనాల్స్ ను శోషించుకుని రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. 
 

యాంటీ బాక్టీరియల్

అరటి ఆకులల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన ఆహారంలో ఉంటే సూక్ష్మక్రిములను చంపి ఫుడ్ ను స్వచ్ఛంగా మారుస్తుంది. ఇది ఒకరకంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
 

మరింత పరిశుభ్రత

సాధారంగా మనం పాత్రలను క్లీన్ చేయడానికి సబ్బులను ఉపయోగిస్తాము. కానీ ఈ సబ్బులల్లో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలు ఉంటాయి. ఈ రసాయన అవశేషాలు గిన్నెలకు ఉండే  అవకాశం ఉంది. కానీ అరటి ఆకులు సహజంగా మైనపు లాంటి పదార్ధంతో పూతను కలిగి ఉంటాయి. ఇది ఆహారాన్ని దాని ఉపరితలానికి అంటుకోకుండా నిరోధిస్తుంది. అందుకే అరటి  ఆకులు చాలా పరిశుభ్రమైనవి. వీటిని నీటితో కడిగి మళ్లీ ఉపయోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి సబ్బును పెట్టాల్సిన అవసరం లేదు. 

ఈ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. అరటి ఆకుల్లో తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఈ అరటిఆకులు దక్షిణ భారతీయ వంటకాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి.  మెటల్,  గాజు ప్లేట్లతో పోలిస్తే ఇవి మరింత చవకైనవి. అరటి ఆకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు.  ముఖ్యంగా పేపర్ ప్లేట్లు, పునర్వినియోగపరచదగిన ప్లాస్టిక్ ప్లేట్లతో పోలిస్తే ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. 

click me!