రోజూ ఫాస్ట్ ఫుడ్ ను తింటున్నారా? కన్ఫా మ్ మీకు ఈ రోగాలొస్తయ్..

First Published Jan 20, 2023, 1:53 PM IST

ఫాస్ట్ ఫుడ్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఓ  పరిశోధన ప్రకారం.. ఫాస్ట్ ఫుడ్ ను రోజూ తినడం వల్ల స్టెయాటోసిస్ అని పిలువబడే కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. అలాగే..
 

fast food

ఈ రోజుల్లో ఇంటి ఫుడ్ కంటే బయటిఫుడ్ ను తినేవారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ ను. నిజానికి ఫాస్ట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని అందరూ ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ ఫుడ్ ను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే ఈ ఫుడ్ లో పోషకాలు ఉండవు. కేలరీలు, కొవ్వు, షుగర్ మాత్రమే ఉంటాయి. దీనికి తోడు ఫాస్ట్ ఫుడ్స్ లో వాడే పదార్థాల వల్ల లేనిపోని రోగాలొస్తాయి. ఫాస్ట్ ఫుడ్ ను తినడం వల్ల బరువు పెరగడంతో పాటుగా గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

క్రమం తప్పకుండా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనం తెలిపింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని పిలువబడే వ్యాధికి కారణమవుతుంది. అంటే ఈ వ్యాధి వల్ల కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. ఫాస్ట్ ఫుడ్ నుంచి రోజువారీ కేలరీలలో 20% లేదా అంతకంటే ఎక్కువ తీసుకోవడం స్టెయాటోసిస్ అని పిలువబడే కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

ఫాస్ట్ ఫుడ్ ఆహారాలలో కొవ్వు, కేలరీలు, చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ పోషకాలు, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ ను తరచుగా తినడం వల్ల ఎలంటి సమస్య లేనప్పటికీ.. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం, గుండెపోటు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదం మాత్రం పక్కాగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

యునైటెడ్ స్టేట్స్ 2017-18 నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే నుంచి డేటాను ఈ అధ్యయనం కోసం ఉపయోగించారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారికి గుండె జబ్బులు, కాలేయ క్యాన్సర్ లేదా ఎండ్-స్టేజ్ కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఫాస్ట్ ఫుడ్ నుంచి మొత్తం రోజువారీ కేలరీలలో కనీసం ఐదో వంతు తీసుకోవడం వల్ల కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. ఇది కాలేయ క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. అలాగే సిరోసిస్ సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 

కొవ్వు స్థాయిలు కొద్దిగా పెరిగినా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే ఫాస్ట్ ఫుడ్ ను క్రమం తప్పకుండా తినే అలవాటును మానుకోండి. అప్పుడే మీరు  అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు.

click me!