ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు ఎన్నెన్నో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం వంటి అలవాట్లను అలవర్చుకోవాలని చెబుతుంటారు. వీటన్నింటినీ పక్కన పెడితే మన పెద్దలు కూడా ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. అందులో ఒకటి ఆహారాలన్ని బాగా నమిలి తినాలని. కానీ చాలా మంది ఇలా అస్సలు తినరు. వెనకాల ఏవో తరుముతున్నట్టు.. తుఫాను ముంచుకొస్తున్నట్టుగానే ఫాస్ట్ ఫాస్ట్ గా తింటుంటారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తెస్తుంది. ముఖ్యంగా ఊబకాయం.