క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'అ..ఆ..' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు ముందు ఈ సుందరి ‘ప్రేమమ్’ సినిమాలో నటించి సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు తిరుగులేకుండా తెలుగు చిత్రాల్లో తనదైన స్టైల్లో నటిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ అమ్మడు కార్తికేయ 2 సినిమాలో నటించింది. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ అందం, ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుందట. అందుకే ఏ మాత్రం చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ చిన్నది రోజూ తన భోజనంలో ఎన్నో రకాల ప్రోటీన్లు తీసుకుంటుందట. అందుకే అంత అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకీ అనుపమ ఎలాంటి ఫుడ్స్ ను తింటుందో తెలుసుకుందాం పదండి..