Health Tips: మాంసాహారం అతిగా లాగిస్తే ఆ రోగాలొస్తయ్ జాగ్రత్త..

Published : Apr 11, 2022, 03:39 PM IST

Health Tips: మాంసం మన ఆరోగ్యానికి మంచి చేసేదే అయినా.. మితిమీరి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
19
Health Tips: మాంసాహారం అతిగా లాగిస్తే ఆ రోగాలొస్తయ్ జాగ్రత్త..

మాంసాహారం తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు  అందుతాయి. అలా అని దీన్నిఅతిగి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఏరికోరి తెచ్చకున్నిట్టే అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

29

వెజ్ కంట్ నాన్ వెజ్ ప్రియులే ఎక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. వెరైటీ వెరైటీ నాన్ వెజ్ ఐటమ్స్ ను ఇష్టంగా తినేవారు లేకపోదు. ఆ మాంసాహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

39

మాంసాహారం మనకు ఎంతో మేలు చేసేదే అయినా.. దీన్ని పరిమితికి మించి తింటే మాత్రం ఎన్నో తంటాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

49

నాన్ వెజ్ ఎక్కువగా తినే వారిలోనే కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పలు పరిశోధనల ప్రకారం..  నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్లే చాలా మంది ప్రమాదకరమైన హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ బారిన పడుతున్నారట. 
 

59

నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్  విపరీతంగా పెరిగిపోయి.. హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

69

మీకు తెలుసా.. మాంసం ఎక్కువగా తింటే విపరీతంగా వెయిట్ పెరుగుతారు. బరువు తగ్గేందుకు మొక్కల ఆధారిత ఆహారాలు సహాయపడితే.. మాంసాహారం మాత్రం వెయిట్ పెరిగేందుకు సహాయపడుతుంది. 

79

మాంసాహారం ఎక్కువ తింటే ఫ్యూచర్ లో ఎన్నో జబ్బుల పాలయ్య ప్రమాదం ఉంది. ముఖ్యంగా నాన్ వెజ్ ఎక్కువగా తింటే ప్రేగుల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పేగుల పనితీరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. 

89

పంది , గుడ్డు, మేక మాంసం ఎక్కువగా తింటే చెడుకొలెస్ట్రాల్ ధమనుల్లో పేరుకుపోయి గుండె కు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

99

మాంసం మోతాదుకు మించి తినడం వల్ల ప్రమాదకరమైన పెద్దపేగు క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మాంసాహారాన్ని మోతాదుకు మించి అస్సలు తినకండి. అలాగే నాన్ వెజ్ ను ఎక్కువగా తినేవారు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories