sperm
Sperm Count Increase Food:ప్రస్తుత కాలంలో సంతానోత్పత్తి సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ సంతానోత్పత్తి సమస్యకు స్పెర్మ్ కౌంట్ తగ్గడం కూడా ఒక కారణమే. శుక్రకణాలు తగినంతగా లేకపోతేనే ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి.
ఈ ఆధునిక జీవన శైలి కూడా ఈ సమస్యకు ఒక కారణమంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహారాలను తప్పక తీసుకోవాల్సిందేనంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ చాక్లేట్.. డార్క్ చాక్లెట్ స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. కొకొవా అనే గింజలతో ఈ చాక్లెట్ ను తయారుచేస్తారు. కాగా ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శుక్ర కణాలను పెంచడానికి సహాయపడతాయి.
గుడ్లు.. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి సహాయపడతాయి. గుడ్డును ఉడకబెట్టుకునే తినాలని ఏమీ లేదు. ఏ రూపంలో తీసుకున్నా స్పెర్మ్ పెరుగుతుంది.
అరటిపండ్లు.. అరటిపండులో విటమిన్ సి, విటమిన్ బి1 , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు అరటిపండులో ఉంటే బ్రోమెలైనే అనే ఎంజైమ్ శుక్రకణాలను పెంచడానికి ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి.. వెల్లుల్లిలో ఉండే సెలీనియం అనే ఎంజైమ్ శుక్రకణాలను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు దీనిలో ఉండే అలిసిన్ శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యేలా చూస్తుంది.
పాలకూర.. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఫోలిక్ యాసిడ్ ఎంతో సహాయపడుతుంది. కాగా ఇది పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరచుగా పాలకూరతో పాటుగా ఇతర ఆకు కూరలను తినండి. స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది.
వాల్ నట్స్.. వాల్ నట్స్ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే ఇవి స్పెర్మ్ కౌంట్ ను పెంచగలవు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శుక్రకణాల సంఖ్యను పెంచడానికి సహాయపడతాయి.
దానిమ్మ పండ్లు.. దానిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్మెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. దానిమ్మ గింజలను లేదా గింజలను జ్యూస్ గా చేసుకుని తాగిన వీర్య కణాలు పెరుగుతాయి.
గుమ్మడికాయ గింజలు.. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటో స్టెరోల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్ వీర్య కణాలను పెంచుతాయి.
చేపలు.. చేపల్లో జింక్ తో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతున్న వారు చేపలను తరచుగా తింటే మంచిది.