‘పి’ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి.. తప్పక తినండి

Published : Nov 17, 2022, 04:02 PM ISTUpdated : Nov 17, 2022, 04:06 PM IST

నిజానికి పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అందులో ‘పి’ అక్షరంతో ప్రారంభమయ్యే పండ్లు రుచిలోనే కాదు.. ప్రయోజనాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి.   

PREV
19
 ‘పి’ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి.. తప్పక తినండి

ఏవి తిన్నా.. తినకపోయినా సీజనల్ పండ్లను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. ఎందుకంటే పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. పండ్లు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన చర్మం, జుట్టు అందానికి కూడా ఎంతో ఉపయోపగడతాయి. కొన్ని పండ్ల విత్తనాలు, తొక్కలు కూడా ఉపయోగపడతాయి. పండ్లలో చాలా రకాలు ఉంటాయి. అందులో మనం ‘P’ అనే అక్షరంతో మొదలయ్యే పండ్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

29
papaya

బొప్పాయి (PAPAYA): పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే పండ్లలో బొప్పాయి మొదటి స్థానంలో ఉంటుంది. సాధారణంగా బొప్పాయి అన్ని సీజన్లలో లభిస్తుంది. ఈ పండులో చాలా పోషకాలు ఉంటాయి. ఈ పండు తియ్యగా, టేస్టీగా ఉంటుంది. బొప్పాయి జ్యూస్ ను తాగితే పొందదే లాభాలు అన్నీ.. ఇన్నీ కాదు. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయి మన ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి పండుతో సబ్బును కూడా తయారుచేస్తారు. ఇది చర్మానికి గ్లో నిఇస్తుంది. ఇది చర్మ సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

39

దానిమ్మ (Pomegranate) : దానిమ్మ పండును క్రమం తప్పకుండా తింటే మన ఆరోగ్యానికి ఏడోకా ఉండదు. కానీ దీని తొక్కను తీయడానికి బద్దకంగా అనిపించి చాలామంది ఈ పండుకు దూరంగా ఉంటుంటారు. కానీ దానిమ్మ గింజలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఎందుకంటే ఇవి మన శరీరంలో రక్తం స్థాయిలను పెంచడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు ఎంతో మంచి చేస్తాయి.  దానిమ్మలో గ్రీన్ టీ కంటే మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే దానిమ్మ పండును ప్రతిరోజూ తినాలి. దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.

49

పాషన్ ఫ్రూట్స్ (Passion Fruits): చూడటానికి అత్యంత ఆకర్షణీయమైన, రుచికరమైన పండ్లలో ఇదీ ఒకటి. ఈ పండు బయట కుంకుమపువ్వు రంగులో ఉంటే.. లోపల పసుపు రంగులో ఉంటుంది. దీనిని ఎన్నో పానీయాలలో కూడా ఉపయోగిస్తారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

59

ఎండుద్రాక్ష: డ్రై ఫ్రూట్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. హైడ్రేటెడ్ గా ఉండే ద్రాక్షలను ఎండబెట్టి.. కిస్ మిస్ లుగా తయారుచేస్తారు. దీనిలో పోషకాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.ఇందులో పీచుపదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. 
 

69
Peach

పీచ్ (Peach): పీచ్ రుచికరమైన పండు.. పీచు పండులో విటమిన్-సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. సీజన్లు మారుతున్నప్పుడు మన ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గి.. దగ్గు, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పీచ్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

79
pear

పియర్స్ (Pears) : పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే మరొక పండు పియర్స్. ఈ పండులో  ఫైబర్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ప్రతి ఒక్కరూ పియర్స్ ను ఇష్టంగా తింటుంటారు. గ్రీకు పురాణాలలో ఈ పండు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి.
 

89
pineapple

పైనాపిల్  (Pineapple): పైనాపిల్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా దక్షిణ ఫ్లోరిడా,  కాలిఫోర్నియా వంటి చల్లని వాతావరణాల్లో ఎక్కువగా పండుతాయి. పైనాపిల్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.  

99
plum

ప్లమ్ (Plum): గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్లమ్ పండును ఖచ్చితంగా తినాల్సిందే. ఇది గుండెకు చాలా మంచిది. ఇది అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో పండుతుంది. దీనిలో  విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ప్లమ్ లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories