ఈ రోజుల్లో చాలా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పైగా ఫిట్ నెస్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. వ్యాయామంతో పాటుగా, డైట్ ను కూడా పక్కాగా పాటిస్తున్నారు. ఇందుకోసం డైట్ ఫుడ్స్, డ్రింక్స్ నే తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాదు.. ఎన్నో రోగాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. కానీ ఇలాంటి ఆహార పదార్థాలు, పానీయాలు మిమ్మల్ని ఎన్నో జబ్బుల బారిన పడేస్తాయని బ్రిటన్ ఎపిడెమియాలజిస్ట్, సైన్స్ రచయిత టిమ్ స్పెక్టర్ తెలిపారు.