తలనొప్పిని, ఎసిడిటీ ని వెంటనే తగ్గించే చిట్కాలు మీ కోసం..

Published : Oct 10, 2022, 11:50 AM IST

తలనొప్పి, ఎసిడిటీ బాధలు మాటల్లో చెప్పలేనివి. కొన్ని కొన్ని సార్లు ఇవి ఎన్ని గంటలైనా తలనొప్పి అలాగే ఉంటుంది. దీనివల్ల ఏ పని చేయాలనిపించదు. అయితే కొన్ని ఆహారాలతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటంటే.. 

PREV
17
  తలనొప్పిని, ఎసిడిటీ ని వెంటనే తగ్గించే చిట్కాలు మీ కోసం..

తలనొప్పి, ఎసిడిటీ సమస్యలకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లను వేసుకునే వారు కూడా ఉన్నారు. నిజానికి మెడిసిన్స్ ను ఎప్పుడెప్పుడు వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఒత్తిడి, మారుతున్న వాతావరణం, నిద్రసరిగ్గా లేకపోవడం, ఆందోళన, జీర్ణ సమస్యలు తలనొప్పికి దారితీస్తాయి. 
 

27
headache

మైగ్రేన్, సైనస్ వంటి సమస్యల వల్ల తలనొప్పి విపరీతంగా వస్తుంది. సాధారణంగా తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి మందులను వాడరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తలనొప్పిని, ఎసిడిని కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

నీళ్లను ఎక్కువగా తాగాలి

నీళ్లు సర్వ రోగ నివారిణీ అంటారు నిపుణులు. ఎందుకంటే నీరు బరువు తగ్గడం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నిజానికి మన శరీరంలో నీరు తగినంతగా లేకుంటెనే బాడీ డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి వస్తుంది. అందుకే తలనొప్పి వచ్చినప్పుడు నీళ్లను ఎక్కువగా తాగాలి. మీ మూత్రం రంగులో ఎలాంటి తేడా లేదని నిర్ధారించుకునే వరకు నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు మీ శరీర కోర్ ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. 
 

47

కోకుమ్ షెర్బత్

కోకుమ్ అనే పండు ప్రధానంగా కొంకణ్, గోవా ప్రాంతాల్లోనే పండుతుంది. ఈ పండు కడుపులో గ్యాస్ న్ తగ్గిస్తుంది. భోనానికి కొన్ని గంటల ముందు నానబెట్టిన తులసి గింజలతో ఒక గ్లాస్ కోకుమ్ షెర్బత్ ను తీసుకుంటే మంచిది. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పురుద్దరిస్తుంది.   

57
Curd Rice

పెరుగు అన్నం

మధ్యాహ్నం లంచ్ లో పెరుగు అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది. ఇది తలనొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగు అన్నాన్ని సాయంత్రం కూడా  తినొచ్చు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. 

67

గుల్కాండ్ మిల్క్

గుల్కాండ్ మిల్క్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ పాలలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుల్కాండ్ ను పాలలో కలిపి తాగితే రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు.ఇది తలనొప్పిని, ఒత్తిడిని తగ్గిస్తుంది. 

77
fruits

పండ్లు

సీజనల్ ఫ్రూట్స్ ను మరువకుండా తినాలి. వీటిద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. వీటిలో ఉండే విటమిన్ బి నరాలను రిలాక్స్ చేస్తుతుంది. శక్తిని అందిస్తుంది. అన్నిపండ్లలో మామిడి పండును తినడం మాత్రం మర్చిపోకండి. 

Read more Photos on
click me!

Recommended Stories