ఫ్రీజర్ లో వీటిని పొరపాటున కూడా పెట్టకండి.. లేదంటే?

First Published Nov 12, 2022, 2:01 PM IST

చాలా మంది కొన్ని వస్తువులను అవసరానికి మించి కొని ఫ్రీజర్ లో నిల్వ చేస్తుంటారు. ఇది మంచిదే కానీ.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రీజర్ లో అస్సలు పెట్టకూడుదు. ఒకవేళ పెడితే.. 
 

మనలో చాలా మంది ఈ పూటకే కాదు.. వారం దాకా బయటకు వెళ్లే అవసరం లేకుండా సరుకులను కొంటుంటారు. ఇవి పాడవకుండా ఫ్రీజర్ లో నిల్వ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ అలవాట్లు లాక్ డౌన్ నుంచి పెరిగిపోయింది. నిజానికి ఇది ఒక రకంగా మంచి అలవాటే. కానీ వేటిని ఫ్రీజర్ లో పెట్టాలి? వేటిని పెట్టకూడదు అన్న విషయాలు పక్కాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల పదార్థాలను ఫ్రీజర్ లో అస్సలు పెట్టకూడదు. అవేంటంటే.. 
 

పాలు, పాల ఉత్పత్తులు

రెండు మూడు రోజులు వచ్చేటన్నీ లీటర్ల పాలను కొనేస్తుంటారు చాలా మంది. కానీ పాలను, పాల ఉత్పత్తులైన జున్ను, వెన్న వంటి వాటిని ఫ్రీజర్ లో అసలే పెట్టకూడదు. కానీ చాలా మందిని వీటిని ఫ్రీజర్ కు కిందున్న ట్రేలో పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల పాలు, పాల ఉత్పత్తుల్లు ఘనీభవిస్తాయి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే పాలను, పాల ఉత్పత్తులను ఫ్రీజర్ లో పెట్టడం మానుకోండి. 

పండ్లు

మనలో చాలా మంది పండ్లను కొసేసి.. ఫ్రీజర్ లో పెట్టేస్తుంటారు. కానీ పండ్లను ఫ్రీజర్ లో పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా వీటిని ఫ్రీజర్ కు దగ్గరగా ఉండే ట్రేలో అసలే పెట్టకూడదు. వీటివల్ల పండ్లు గట్టిపడతాయి. అలాగే వీటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. రుచికూడా మారుతుంది. ముఖ్యంగా ఎండు ద్రాక్షలను, నారింజ పండ్లను, అత్తి పండ్లను ఫ్రీజర్ లో పెట్టొచ్చు. 
 

సాస్

ప్రస్తుతం జనాలు సాస్ ల రుచికి బాగా అలవాటు పడిపోయారు. చిల్లీ సాస్, టొమాటో సాస్ అంటూ అన్ని రకాల సాస్ ల రుచులను ఆస్వాధిస్తున్నారు. వీటని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రస్తుతం చాలా మంది సాస్ బాటిల్లను కొని ఫ్రీజర్ లో నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఇది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుందని నమ్ముతారు. నిజానికి సాస్ లను ఫ్రీజర్ లో పెట్టనే కూడదు. అసలు దీంట్లో పెడితే అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్న నమ్మకం అసలే లేదు. వీటిని ఫ్రీజర్ లో ఉంచితే దీనిలో కలిపిన ముడిపదార్థాలు వేరు పడి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారతాయి.
 

ప్యాకెట్ ఉత్పత్తులు

ప్యాకెట్ ఉత్పత్తులైన నూడుల్స్, కాఫీపౌడర్ వంటివి వాటిని ఫ్రీజర్ లో ఉంచడం అంత మంచిది కాదు.  కాఫీ పౌడర్ ప్యాకెట్ ను ఫ్రీజర్ లో ఉంచితే దాని టేస్ట్ చేంజ్ అవుతుంది. స్మెల్ కూడా రాదు. అంతేకాదు ఈ పౌడర్ కాస్త ముద్దగా మారిపోతుంది కూడా. దీన్ని ఉపయోగించడం కష్టం. ఇకపోతే నూడుల్స్ ను ఫ్రీజర్ లో ఉంచితే అవి చల్లగా అయ్యి మృదువుగా మారతాయి. వీటిని ఏ రకంగానూ ఉపయోగించలేం.. 
 

తృణధాన్యాలు

కొంతమంది తృణధాన్యాలను, ఫ్రైడ్ ఫుడ్స్ ను కూడా ఫ్రీజర్ లో పెడుతుంటారు. వీటిని ఇందులో పెట్టి తినడం వల్ల ఎలాంటి అనర్థాలు జరగనప్పటికీ.. ఇవి అస్సలు టేస్ట్ ఉండవు. ఒకవేళ మీరు వీటిని ఫ్రీజర్ లో పెట్టి ఆ వెంటనే అస్సలు తినకూడదు. ఇవి గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాతే తినాలి. ఉపయోగించాలి. 
 

click me!