బార్లీ నీటి అద్బుత ప్రయోజనాలు.. రోజూ గ్లాస్ తాగారంటే..?

First Published Jan 31, 2023, 11:52 AM IST

నిజానికి మనలో చాలా మంది కడుపు నింపడానికే తింటుంటారు. కానీ ఏ ఆహారాలు మంచివి? ఏవి ఎంత మొత్తంలో తినాలి? అన్న సంగతిని పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఆరోగ్యానికి మేలు చేసే వాటినే తినరు. మీకు తెలుసా బార్లీ మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. 
 

బార్లీలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. చాలా మంది ఈ  ధాన్యాలను ఎన్నో వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. నవరాత్రుల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. కొత్త పనులను ప్రారంభించడానికి ఈ ధాన్యాలను శుభప్రదంగా భావిస్తాయి. నిజానికి ఎనకటి కాలంలో ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల జనాలు బార్లీని తక్కువగా వాడేవారు. మీకు తెలుసా? ఎన్నో సమస్యల నుంచి బయటపడేందుకు బార్లీని పురాతన కాలంలో ఎక్కువగా తినేవారట. ఆయుర్వేదంలో వీటిని ఔషదంగా ఉపయోగిస్తారు. 
 

బార్లీని సూప్ లు, రొట్టెలు, పాస్తా వంటి ఎన్నో వంటకాల్లో ఉయోగిస్తారు. వీటితో పాటుగా బార్లీ ప్రయోజనాలను పొందేందుకు బార్లీ నీటిని కూడా తాగొచ్చు. ఇది ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది. ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు, తాతలు కూడా ఈ నీటిని తాగుతుంటారు. దీని ప్రయోజనాల గురించి తెలుసుకునే ముందు బార్లీ వాటర్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

barley water


బార్లీ వాటర్ కు కావాల్సిన పదార్థాలు

బార్లీ - 1/4 కప్పు
నల్ల మిరియాలు (సన్నగా తరిగినవి) - 1 టీస్పూన్
యాలకులు - 2
సోంపు గింజలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
పసుపు
 


బార్లీ నీటిని తయారుచేసే విధానం

ముందుగా బార్లీని 2 గంటలు నానబెట్టండి.  ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసుల నీటిని పోసి మీడియం మంట మీద పెట్టండి. దీంట్లో నానబెట్టిన బార్లీని వేయండి. ఆ తర్వాత నల్ల మిరియాలు, యాలకులు, సోంపు, జీలకర్ర వేసి బాగా మరిగించండి. ఈ నీటిని 7 నుంచి 10 నిమిషాలు బాగా మరిగించండి. తర్వాత నీటిని వడకట్టి గ్లాస్ లో పోయండి. ఇప్పుడు దీనికి నిమ్మకాయ రసాన్ని కలపండి. అంతే ఆరోగ్యకరమైన బార్లీ వాటర్ రెడీ అయినట్టే.. దీని నుంచి మంచి ప్రయోజనాలను పొందాలంటే ఉదయం పరిగడుపున తాగండి. 
 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బార్లీ నీరు బాగా సహాయపడుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బార్లీలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఆరోగ్యకరమైనది. ఎందుకంటే వీటి వాడకం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. బార్లీ నీటిని తాగడం వల్ల తరచుగా ఆకలయ్యే సమస్యే ఉండదు. అలాగే మీరు తక్కువ మొత్తంలో కేలరీలను తీసుకుంటారు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

barley water

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

బార్లీలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సిద్ధం చేస్తాయి. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. బార్లీ నీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మకాయ రసాన్ని కలపడం వల్ల ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

barley water

కొలెస్ట్రాల్ సమస్యను నియంత్రిస్తుంది

బార్లీ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఈ నీరు మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అంతేకాదు ఈ నీళ్లు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. బార్లీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. 
 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) సమస్యలను తగ్గించడానికి కూడా బార్లీ వాటర్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఎక్కువ మూత్ర విసర్జనకు సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగిపోతాయి. అలాగే కిడ్నీ స్టోన్స్ సమస్య కూడా తొందరగా తగ్గిపోతుంది. బార్లీ వాటర్ ను రోజూ తాగడం వల్ల మూత్రాశయం, మూత్రపిండాలు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. దీని వల్ల యూటీఐ లాంటి సమస్య వచ్చే అవకాశం ఉండదు.

click me!