విటమిన్ బి 12 లోపం.. మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి

First Published Jan 31, 2023, 9:51 AM IST

మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఇవి లోపిస్తే శరీర ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఏ పనిచేతకాకపోవడం, ఊరికే అలసిపోవడం, రక్తం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన శరీరానికి రకరకాల పోషకాలతో పాటుగా విటమిన్ బి 12 కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది ఎర్ర రక్తకణాలు, డీఎన్ ఏ ఏర్పడటానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మన నాడీవ్యవస్థకు మద్దతునిస్తుంది. ముఖ్యంగా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మన శరీరానికి అవసరమైన విటమిన్ బి12 ను తప్పకుండా తీసుకోవాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. ఇన్ని విధులను నిర్వహించే విటమిన్ బి 12 మన శరీరంలో లోపించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మీకు తెలుసా..? ఈ విటమిన్ మరీ తక్కువగా అయినప్పుడు మన శరీరం మనకు ఎన్నో సంకేతాలను ఇస్తుంది. వాటిని అర్థం చేసుకుని టెస్ట్ చేయించుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ విటమిన్ బి 12 లోపించినప్పుడు మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..? 

తలనొప్పి

విటమిన్ బి 12 నాడీవ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే ఇది లోపించినప్పుడు నాడీవ్యవస్థ పనితీరుకు ఆటంకం కలుగుతుంది. ఈ  పోషకం కేంద్ర నాడీ వ్యవస్థకు మద్దతునిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఈ పోషకాన్ని మన శరీరం కోల్పోతే.. ఇది తలనొప్పితో సహా నాడీ లక్షణాలకు దారితీస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2020లో  ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... కౌమారదశలో విటమిన్ బి12 లోపించడం వల్ల కలిగే అత్యంత సాధారణ లక్షణాలలో తలనొప్పి ఒకటని కనుగొన్నారు. 2019 లో ప్రచురించబడిన మరొక అధ్యయనం ప్రకారం.. ఈ విటమిన్ బి12  స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి మైగ్రేన్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు. 

గందరగోళం, ఏకాగ్రతలో ఇబ్బంది

ఎవరి శరీరంలో అయితే విటమిన్ బి12 స్థాయిలు తక్కువగా ఉంటాయో.. వారు విషయాలపై ఏకాగ్రతను పెట్టలేరు. అలాగే గందరగోళంగా ఉంటారు. ఎన్నో పరిశోధనల ప్రకారం.. విటమిన్ బి 12 లోపం.. తక్కువ  జ్ఞాపకశక్తి, జ్ఞానంతో ముడిపడి ఉంది. ఎందుకంటే మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండేందుకు ఈ పోషకం చాలా అవసరం. అందుకే ఈ పోషకం తక్కువగా ఉన్నప్పుడు మానసిక గందరగోళం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. 

Fatigue

అలసట

ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి విటమిన్ బి 12 చాలా చాలా అవసరం. అందుకే శరీరంలో ఈ ముఖ్యమైన పోషకం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అది మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత స్థితికి వెళుతుంది. మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత అనేది రక్త రుగ్మత. అంటే దీనిలో మన శరీరం అసాధారణంగా పెద్ద ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఈ సమస్య అత్యంత సాధారణ లక్షణాలలో అలసట ఒకటి. చిన్న చిన్న పనులను చేసినా.. చేయకపోయినా కూడా మీరు అలసిపోయినట్టుగా భావిస్తారు. దీనివల్ల మీ రోజు వారి పనులను కూడా పూర్తిచేయకపోకపోతుంటారు. 
 

tingling feet

చేతులు, కాళ్ళలో జలదరింపు

కాళ్లలో, చేతులల్లో జలదరింపు లేదా సూదులు గుచ్చినట్టుగా ఉండటం కూడా విటమిన్ బి 12 లోపం లక్షణమే. ఇది తరచుగా చేతులు, కాళ్లలో మంటను కలిగిస్తుంది. ఈ భాగాల్లోనే కాదు శరీరంలోని ఇతర భాగంల్లో కూడా ఇలా అనిపించొచ్చు. మంటగా, సూదులు గుచ్చుకున్నట్టుగా, దురదగా, జలదరింపు వంటి సమస్యలు కలగొచ్చు. 
 

Skin care

లేత, పసుపు చర్మం

విటమిన్ బి 12 లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. దీనిని కోబాలమిన్ లోపం అని కూడా పిలుస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీ శరీరం తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను తయారు చేయలేకపోతుంది. దీనివల్ల మీ చర్మం రంగు మారుతుంది. అంటే మీ చర్మం లేత లేదా పసుపు రంగులోకి మారిపోతుందన్న మాట. 

నోటి పూత

గ్లోసిటిస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది నోటిలో మంటకు దారితీసే పరిస్థితి. అలాగే మీ నాలుక వాపురావడం, ఎర్రబడటం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్య విటమిన్ బి 12 లోపంతో సంబంధం కలిగి ఉంటుంది. విటమిన్ బి 12 లోపం మెగాలోబ్లాస్టిక్ రక్తహీనతకు దారితీస్తుంది. ఇది గ్లోసిటిస్ తో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు మీ నాలుగ ఆకృతిలో మార్పులు వస్తాయి. దీనిని "ఎరుపు, పుండ్లు" అని అంటారు. ఏదేమైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే విటమిన్ బి12 టెస్ట్ ను చేయించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. 

click me!