తిన్న తర్వాత ఈ పనులను మాత్రం చేయకండి.. లేదంటే..

First Published Oct 6, 2022, 1:00 PM IST

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జనాలకు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద పెరిగింది. ఆరోగ్యకరమైన ఆహారాలనే తింటూ.. ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నారు. 
 

ఆరోగ్యంగా ఉండేందుకు ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నవారు చాలా మందే ఉన్నారు. ప్రోటీన్ ఫుడ్ ను తీసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ముందే ఇది కరోనా కాలం. దీనికి తోడు మంకీపాక్స్, సీజనల్ రోగాలు, ఇన్ఫెక్షన్లు కూడా మనుషులను పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కేర్ లెస్ గా ఉన్నా.. ఎన్నో రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. అయితే ప్రోటీన్ ఫుడ్ ను తినడం మంచి విషయమే.. మరి తిన్న తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న విషయాలు కూడా తెలియాల్సిందేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తిన్న తర్వాత కొన్ని పనులను అసలే చేయకూడదు. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు మీకు చుట్టుకునే ప్రమాదం ఉంది. 

ఎక్సర్ సైజ్ చేయకూడదు

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటాం. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అయితే కొంతతమంది తిన్న తర్వాత వ్యాయామం చేస్తుంటారు. ఇది అస్సలు మంచిపద్దతి కాదు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కడుపులో నొప్పి, వికారం, వాంతులు అవుతాయి. అందుకే తిన్న తర్వాత ఎక్సర్ సైజెస్ చేయడం మానుకోండి. 

నిద్రపోకూడదు

రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోతే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. నిద్రలేకపోతేనే ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే తిన్న తర్వాత చాలా మందికి వెంటనే నిద్రస్తుంది. ఇంకేముందు హాయిగా పడుకుంటారు. కానీ ఇలా తిన్నవెంటనే పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. చికాకు కూడా పుడుతుంది. అందుకే తిన్నవెంటనే పడుకోకండి. 

పండ్లు తినకూడదు

పండ్ల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అందుకే రోజూ రకరకాల పండ్లను తినాలని నిపుణులు చెబుతుంటారు. కానీ తిన్న తర్వాత పండ్లను తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత పండ్లను తింటే మనన శరీరం పోషకాలను గ్రహించలేదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

coffee

టీ, కాఫీ

సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలను తాగే వారు చాలా మందే ఉన్నారు. టీ, కాఫీలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అందులో భోజనం చేసిన వెంటనే వీటిని తాగడం ఇంకా ప్రమాదకరం. వీటిలో తాగడం వల్ల మన శరీరం ఐరన్ ను గ్రహించలేకపోతుంది. దీనివల్ల రక్తహీతన సమస్య వస్తుంది. 
 

ఆల్కహాల్ తాగకూడదు

సిగరేట్, మద్యం ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను వదులుకోవాలని నిపుణులు చెబుతుంటారు.  అయితే కొందరు తిన్నాక కూడా మందు కొట్టడం, సిగరేట్ కాల్చడం లాంటివి చేస్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఇలాగే చేస్తే ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడటం గ్యారంటీ. 
 

స్నానం చేయకూడదు

ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా, హెల్తీ గా ఉంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే స్నానానికి కూడా సమయం ఉంటుంది. అందులో భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

నీళ్లను తాగడకూడదు

భోజనం చేసిన వెంటనే నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తిన్నది సరిగ్గా అరగదు. అందుకే తిన్నవెంటనే నీళ్లను తాగకండి. తిన్న గంట తర్వాత నీళ్లను పుష్టిగా తాగితే.. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

click me!