కలయిక సమయంలో ఇలా చేస్తున్నారా..? స్త్రీలకు అస్సలు నచ్చదు..!

First Published | Oct 6, 2022, 12:45 PM IST

మీరు సెక్స్‌లో ఎంత మంచిగా ఉన్నా, పురుషులు చేసే అనేక పనులు స్త్రీలకు నచ్చవట.  పురుషులు చేసే కొన్ని పనులు... స్త్రీలకు చిరాకు కలిగిస్తాయట. ఆ పనులేంటో ఓసారి చూద్దాం...

కలయికను ఆసాంతం ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. మీకు పెళ్లై ఎక్కువ కాలం అయినా.. ఇప్పుడే జీవితం మొదలుపెట్టినా సరే.... కలయిక విషయంలో  దంపతులకు కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని వారి భాగస్వాములే పూర్తి చేయాలి.
 

sex

మీరు ఎంత కాలం జీవించినా, మీరు సెక్స్‌లో ఎంత మంచిగా ఉన్నా, పురుషులు చేసే అనేక పనులు స్త్రీలకు నచ్చవట.  పురుషులు చేసే కొన్ని పనులు... స్త్రీలకు చిరాకు కలిగిస్తాయట. ఆ పనులేంటో ఓసారి చూద్దాం...


పురుషులు చాలా మంది కలయికలో పాల్గొనే సమయంలో  చాలా నిశ్శబ్దం గా ఉంటారట. అయితే... అది స్త్రీలకు అస్సలు నచ్చదట. ఏమీ మాట్లాడకుండా.. ఏదో పని చేసినట్లుగా చేస్తూ వెళ్లడం స్త్రీలకు అస్సలు  నచ్చదట. ప్రేమ గా మాట్లాడుతూ.. దగ్గరకు తీసుకుంటే బాగుండని భావిస్తారట.
 

స్త్రీలలో కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. కలయిక సమయంలో ఆ పార్ట్స్ ని సున్నితంగా తాకడం లాంటివి చేస్తే వారికి బాగా నచ్చుతుందట. అయితే.. వాటిని పురుషులు పట్టించుకోనట్లుగా ప్రవర్తిస్తే.. వారికి నచ్చదట.
 

పురుషులు ఆఫీసుకు వెళ్లే సమయంలో కాళ్లకు సాక్సులు వేసుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే.. కొందరు కలయికలో పాల్గొనే సమయంలో కనీసం కాళ్లకు ఉన్న సాక్సులు కూడా తొలగించరట. అది వారిలోని బద్దకానికి నిదర్శనం. ఇది మీ స్త్రీల మూడ్ ని దెబ్బ తీసే అవకాశం ఉంది.
 


అన్నింటికన్నా ముఖ్యమైనది కలయిక సమయంలో రొమాన్స్ ని స్త్రీలు ఎక్కుగా కోరుకుంటారు. కానీ.. చాలా మంది రొమాన్స్ పక్కన పెట్టి.. అనుమతి లేకుండానే అంగప్రవేశం చేస్తారట. అది స్త్రీలకు అస్సలు నచ్చని విషయమట. 
 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.... చాలా మంది పురుషులు కలయిక సమయంలో కండోమ్ వినియోగించరట. నిజానికి కండోమ్ సురక్షిత శృంగారానికి చాలా  అవసరం. దానిని నిర్లక్ష్యం చేయడం  స్త్రీలకు అస్సలు నచ్చదట. కండోమ్ లేకుండా కలయికలో పాల్గొనడం.. వారికి ఇష్టం లేకుండా బలవంతం చేయడంతో సమానం.

ఇక.. చాలా మంది  పురుషులు చేసే తప్పుల్లో ఇది కీలకం. స్త్రీలకు ఏం కావాలో అడగకపోవడం. ఎప్పుడూ మీకు నచ్చినట్లు కలయికలో  పాల్గొనడం కాదు. వారికి ఏమి ఇష్టమో... ఎలా చేయాలో అడిగి తెలుసుకోవాలి. ఇక ఫోర్ ప్లే పై కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం

Latest Videos

click me!