ఆకలి లేకపోవడం: ఏం తినాలనిపించడం లేదా..? అయితే మీ శరీరంలో ఈ పోషకం లోపించింది..

Published : Aug 29, 2022, 04:12 PM IST

ఆకలి లేకపోవడం: కొంతమందికి ఎంత మంచి వంటలు చేసిపెట్టినా తినాలనిపించదు. నిజానికి ఇలా ఆకలి లేకపోవడానికి ఎన్నో కారణాలే ఉన్నాయి. అవేంటో తెలుసా..?   

PREV
17
 ఆకలి లేకపోవడం: ఏం తినాలనిపించడం లేదా..? అయితే మీ శరీరంలో ఈ పోషకం లోపించింది..

ఎంత మంచి వంటలు ముందున్నా తినాలనిపించడం లేదే అని బాధపడేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి ఆకలి లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఇలా తినాలనిపించకపోవడం వల్ల ఎప్పుడూ నీరసంగానే ఉంటారు. బాగా అలసిపోతారు కూడా. దీనికి తోడు ఇలా తినకుండా ఉండేవారు చాలా తొందరగా బరువు తగ్గుతుంటారు. ఇలాంటి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండకపోతే.. ఎంతో ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఇలా దీర్ఘకాలంపాటు తినకుండా ఉంటే శరీరం బలహీనపడుతుంది. శరీరంలో జింక్ లోపిస్తేనే ఆకలి ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

27

జింక్ మన శరీరానికి ఎందుకు ముఖ్యమైనది

మన శరీరానికి జింక్ చాలా అవసరం. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది గుండెను హెల్తీగా ఉంచుతుంది. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల మీరు నిత్యం యవ్వనంగా ఉంటారు. అంతేకాదు ఇది ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. జింక్ ఆకలిని పెంచడానికి సహాయపడుతుంది. 
 

37

జింక్ లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి

ఆకలి లేకపోవడం

తొందరగా బరువు తగ్గడం

బలహీనంగా మారుతారు

ఊరికే అలసిపోతారు 

మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది

హెయిర్ ఫాల్

తరచుగా విరేచనాలు

గాయాలు తొందరగా మానకపోవడం

వాసన, రుచి లేకపోవడం
 

47

జింక్ లోపం  పోవడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు

పెరుగు

పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని రోజుకు ఒక కప్పైనా తింటే మీరు ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇది తొందరగా జీర్ణం అవుతుంది కూడా. పెరుగును తినడం వల్ల మన శరీరంలో జింక్ లోపం పోతుంది. 
 

57

జీడిపప్పులు

జీడిపప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ కె, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తింటే ఆకలి పెరుగుతుంది. జింక్ లోపం కూడా పోతుంది. 
 

67

చిక్పీస్

చిక్పీస్ లు కూడా జింక్ లోపాన్ని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా జింక్ లోపం తొందరగా పోతుంది. 

 

77

పుచ్చకాయ విత్తనాలు

పుచ్చకాయ గుజ్జును తిని వీటి విత్తనాలు పనికిరాని వాటిగా డస్ట్ బిన్ లో వేస్తుంటారు. నిజానికి ఈ గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు మీ ఆకలిని పెంచుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories