నోరురించే టాకోస్ రెసిపీ.. ఇంట్లోనే ఇలా రుచిగా చెయ్యండి.. ఈ టాకోస్ కి కావాల్సిన పదార్ధాలు.. రెండు కప్పుల గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొన్ని వేడినీళ్లు కావాలి..
తయారీ విధానం.. రెండు కప్పుల గోధుమపిండి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, కొన్ని వేడినీళ్లు అన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో మరల ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎర్రని ఎండుమిరపకాయలను వేసి బాగా వేయించుకోవాలి.
తరువాత వాటిని పక్కన తీసి రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఎర్రగా వచ్చేవరకు వేయించుకోవాలి. ఒక గిన్నెలో ఎండుమిరపకాయలను చేతితో చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో మూడు ఒకే సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపలను పైన ఉన్న పొట్టు తీసి అందులో వేసి మెత్తగా కలుపుకోవాలి.
తరువాత వేయించిన ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ ఉప్పు, తగినంత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఇంతకుముందు కలుపుకున్న గోధుమపిండిని చపాతీల లాగా కొంచెం చిన్న సైజులో గుండ్రంగా రుద్దుకోవాలి. తరువాత వాటిని స్టవ్ నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు కాల్చుకోవాలి. తరువాత ఆ చపాతీపై రెడ్ చిల్లి లేదా టమాటా సాస్ ను ఒక లేయర్లా పూసి అందులో సగం వరకు కొంత చీజ్ వేసి అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టి మడత పెట్టే విధంగా దానిని చుట్టాలి.
తరువాత బాణీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీనిని నూనెలో ఎర్రగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి. ఇంకేముంది మనకు ఇష్టమైన మంచి వేడి వేడి బంగాళదుంప టాకోస్ తయారు అయిపోయినట్టే. చూశారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చక్కగా తయారు చేసుకొని స్నాక్స్ లాగా తినవచ్చు.