పండ్లను తినేటప్పుడు ఇలా అస్సలు చేయకండి.. లేదంటే సమస్యలొస్తయ్ జాగ్రత్త..

First Published Dec 9, 2022, 11:44 AM IST

పండ్లు విటమిన్లకు, ఫైబర్ కంటెంట్ కు గొప్ప మూలం. వీటిద్వారా మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పండ్లను తినేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే వాటిలో ఉండే పోషకాలు తగ్గుతాయి. 
 

బరువు తగ్గేందుకు పండ్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎందుకంటే పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే వారు పండ్లను చిరుతిండిగా తీసుకోవాలని నిపుణులు సలహానిస్తుంటారు. నిజానికి పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని అలాగే లేదా జ్యూస్ గా చేసుకుని తీసుకోవచ్చు. పండ్లు జస్ట్ ఆహారమే కాదు.. ఇవి మన శరీరం పనిచేయడానికి అవసరమైన సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ తో నిండి ఉంటాయి. పండ్ల ద్వారా ప్రయోజనాలను పొందాలంటే వీటిని తినేటప్పుడు మాత్రం కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటంటే.. 
 

పండ్ల కలయికలు

పండ్లు ఇతర ఆహారాల కంటే చాలా ఫాస్ట్ గా విచ్ఛిన్నమవుతాయి. వీటిని ఇతర ఆహారాలతో కలిపినప్పుడు మన శరీరంలో ఆమా (ama)అని పిలువబడే టాక్సిన్స్ ఏర్పడటానికి కారణమవుతాయి. అంతేకాదు  దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. హెవీ ఆహారం జీర్ణం కావడానికి పట్టేంత సేపు.. ఈ పండ్లు కడుపులోనే ఉండాలి. దీనివల్ల పోషక శోషణ కష్టమవుతుంది. ఇది జీర్ణ రసాలలో పులియబెట్టడం మొదలవుతుంది. ఇది సాధారణంగా విషపూరితమైనది. ఎన్నో అనారోగ్య  సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తీసుకోకండి. వీటిని విడిగా తినడమే ఆరోగ్యానికి మంచిది. 
 


రాత్రిపూట పండ్లను తినడం

నిద్రపోవడానికి 2 నుంచి 3 గంటల ముందు ఎలాంటి ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. ఇది పండ్లకు కూడా వర్తిస్తుంది. పడుకునే ముందు పండ్లను తినడం వల్ల మీరు రాత్రిళ్లు హాయిగా పడుకోలేరు. ఎందుకంటే ఇవి చాలా చక్కెరను విడుదల చేస్తాయి. ఇది శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు శక్తి స్థాయిలను పెంచుతుంది. దీంతో రాత్రిపూట పోషకాలను గ్రహించే సామర్థ్యం చాలా తగ్గుతుంది. రాత్రిపూట ఆలస్యంగా పండ్లను తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. పండ్లను సాయంత్రం చిరుతిండిగా తింటే మంచిది. 
 

వెంటనే నీరు తాగడం

పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగడం చూసే ఉంటారు. నిజానికి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు. ఎందుకంటే పండ్లు తిన్న తర్వాత నీళ్లను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పిహెచ్ స్థాయి అసమతుల్యంగా మారుతుంది. ముఖ్యంగా పుచ్చకాయ, మస్క్ మెలోన్, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగకూడదు. ఎందుకంటే ఎక్కువ నీరున్న పండు మీ కడుపు ఆమ్లతను తగ్గించడం ద్వారా పిహెచ్ సమతుల్యతను మారుస్తుంది. ఇలా చేయడం వల్ల డయేరియా, కలరా వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

పండ్ల తొక్కను తీసేయడం

విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పండ్లలోపలి భాగంలో మాదిరిగానే వాటి తొక్కల్లో కూడా పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ఆపిల్ తొక్కల్లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ చాలా మంది పండ్ల తొక్కలను తీసేసే తింటుంటారు. పండ్లను తొక్కతో సహా తినడం వల్ల ఊబకాయం, క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. 
 

click me!