ఈ పండుగకు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

First Published Sep 26, 2022, 2:11 PM IST

దేవీ నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్బంగా బరువు తగ్గాలనుకునుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే..

బరువు తగ్గడం నిదానంగా సాగే ప్రక్రియ. దీనిలో ఎంత ఓపిగా ఉంటే అంత మంచి ఫలితాలను చూస్తతారు. కానీ మీరు ఆశించిన ఫలితాలను మాత్రం  పొందలేకపోవచ్చు. అందులోనూ బరువు తగ్గడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టే.. ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. ఆ తర్వాతే అన్నీ నిదానంగా అలవాటు అవుతాయి. ముందు ఇది పండుగ సీజన్. ఇంకేముందు ఎన్నో పార్టీలకు వెల్లి ఎన్నో రకాల డిషెస్ ను తింటుంటారు. ఇవన్నీ మిమ్మల్ని మరింత బరువు పెరిగేలా చేస్తాయి. 
 

weight gain

మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం జంక్ ఫుడ్, స్వీట్ ఐటమ్స్, చక్కెర పానీయాలు, కొవ్వు ఆహారం తినకపోవడమే మంచిది. వీటికి బదులుగా పుష్కలంగా నీటిని తాగుతూ హెల్తీ ఫుడ్స్ ను తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారు. మరి ఈ పండుగ సీజన్ లో మీరు బరువు తగ్గేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలో తెలుసుకుందాం పదండి. 

ఓపికగా ఉండండి

అప్పుడే బరువు తగ్గాలంటే.. కాని పని. ఎందుకంటే బరువు తగ్గే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందుకే మీరు మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించిన వెంటనే ఫలితాలను ఆశించకూకడదు.  మనలో చాలామ౦ది ఇలా అని మొత్తమే ఎంత వెయిట్ తగ్గామన్న ముచ్చటే పట్టించుకోరు. ఇది కూడా మంచిది కాదు. బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రోజుల తర్వాత ఫలితాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగని బరువు తగ్గడం  లేదని ప్రయత్నాన్ని వదులుకోకూడదు. 
 

weightloss

తగినంత నిద్ర

బరువు తగ్గాలనుకునేవారు కంటినిండా నిద్రపోవడం చాలా అవసరం. ఇతర పనులకన్నా నిద్రకే ఎక్కువ సమయాన్ని కేటాయించండి. అంటే ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. కంటినిండా నిద్రపోతేనే మీ శరీరం సక్రమంగా పనిచేస్తుంది. సరిగ్గా పడకోవడం వల్ల  ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. నిద్రే మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. 

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలని మన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. కానీ దీన్ని ఫాలో అయ్యే వారు మాత్రం చాలా తక్కువే. మీకు తెలుసా.. మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఇప్పటి నుంచైనా హెల్తీ ఫుడ్ నే తినండి. ఈ ఆహారాలు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడమే కాదు.. బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. ఎక్కువగా పండ్లు, కూరగాయలను తినండి. 
 

క్రమం తప్పకుండా వ్యాయామం 

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు బరువు తగ్గేందుకు రెగ్యులర్ గా వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. జాగింగ్, వాకింగ్ లేదా జిమ్ కు వెళ్లడం వంటి పనులు చాలా అవసరం. ఇవి మీ శరీరంలో అదనంగా ఉన్న కేలరీలను కరిగించడానికి సహాయడతాయి. 

click me!