నిజంగా మీరు ప్రేమలో ఉన్నారా? ఉన్నానని అనుకుంటున్నారా?

First Published | Sep 26, 2022, 12:57 PM IST

ప్రేమలో పడటానికి.. ప్రేమలో ఉన్నాను అని అనుకోవడానికి చాలా తేడా ఉంది. అభిరుచులు కలిసినంత మాత్రానా అది ప్రేమే అనుకోవడం పొరపాటు. 
 

కొంతమంది ఒక అబ్బాయిని, లేదా అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోతుంటారు. ఇంకొంతమంది వాళ్లతో కొన్నాళ్లు ఫ్రెండ్ షిప్ చేసినాక వాళ్ల అభిరుచులు నచ్చితే ప్రేమలో పడిపోతుంటారు. నిజానికి ఒక వ్యక్తి నచ్చడానికి, ప్రేమలో పడటానికి చాలా తేడా ఉంది. ఎంతమంది అయినా మనకు నచ్చొచ్చు. కానీ ప్రేమ మాత్రం ఒక్కరిపైనే పుడుతుంది. అయితే ఈ ప్రేమకు, నచ్చడానికి తేడా తెలుసుకోవాలి. నచ్చాడు కదా అని నేను అతన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. మరి మీరు నిజంగా ప్రేమలో ఉన్నారో.. లేదో తెలుసుకుందాం పదండి. 
 

మీకు ఒక వ్యక్తి మీకు నచ్చితే సరిపోదు. అవతలి వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రేమించాలి. నీతో ఉండాలనుకోవాలి. అప్పుడే మీ ప్రేమ సార్థకం అవుతుంది. అందుకే మీరు ప్రేమిస్తే.. అవతలి వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోండి. లేదంటే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది.


నిజంగా మీరు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే లవ్  చేస్తున్నారా అన్న విషయం పై కూడా క్లారిటీ తెచ్చుకోండి. లేదా స్వంత అవసరాల కోసమే లవ్ చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి విషయాలు మిమ్మల్ని తర్వాత చాలా ఇబ్బంది పెడతాయి. 
 

ఒక వ్యక్తిని మీరు నిజంగా ప్రేమిస్తే.. అతను చేసిన తప్పులను కూడా క్షమించేస్తారు. లేదంటే అతను చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ను కూడా మీరు క్షమించరు. దానిపై వాదిస్తారు. ఆ తప్పులనే ఎత్తి చూపుతారు. 
 

మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారని అవతలి వ్యక్తి మేలు కోసం ఎంతో సహాయం చేస్తారు. మరి ఆ వ్యక్తి మీ గురించి కూడా అలాగే చేస్తున్నారా? లేదా? ఇది కూడా మీ ప్రేమ నిజమో.. కాదో చెబుతుంది. 
 

కొంతమందికి ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. దీని కోసమని కూడా రిలేషన్ షిప్ లో ఉండాలనుకుంటారు. మరి మీరు ఏ ఉద్దేశంతో రిలేషన్ షిప్ లో ఉన్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 
 

ప్రేమలో పడ్డ చాలా మంది అవతలి వ్యక్తిని ఆకట్టుకోవడానికి.. తమలా అస్సలు ఉండరు. అంటే వారికి నచ్చాలని మరొకరిలా నటిస్తుంటారన్న మాట. ప్రేమలో ఒకరికి ఒకరు నచ్చాలంటే నటించాల్సిన అవసరం లేదు. అలా నటిస్తూ పోతే మిమ్మల్ని మీరు కోల్పోతారు. మీరు నిజంగా ప్రేమలో ఉంటే మీరు నటించాల్సిన అవసరం ఉండదు. అలా నటిస్తేనే మీ బాగస్వామికి నచ్చుతుందంటే వారితో బ్రేకప్ చెప్పడమే మంచిది. 
 

మీరు ప్రేమలో ఉన్నట్టైతే.. మీ ఇద్దరూ కలిసి సాధించాలనుకున్న లక్ష్యాలు మీ ఇద్దరూ కలిసి తీసుకున్నయా? లేకపోతే మీరే మీ ఇష్టాలను అవతలి వారిపై రుద్ది..అలా చేయాలని ప్రోత్సహిస్తున్నారా? ఇది కచ్చితంగా ప్రేమ అయితే కాదు. నచ్చిన వ్యక్తి ఇలా ఉండాలి. అలా చేయాలి అన్న ఆంక్షలు పెట్టరు.
 

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య నీతి, నిజాయితీ చాలా అవసరం. నిజాయితీ లేకపోతే మీది స్వచ్ఛమైన ప్రేమ కాదని అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అతనికి అబద్దాలే చెప్పరు. 

Latest Videos

click me!