బరువు తక్కువుంటే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?

Published : Dec 08, 2022, 01:03 PM IST

బరువు ఎక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే సన్నగా ఉన్నంత మాత్రాన మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. ఉండాల్సిన బరువు కన్నా తక్కువగా ఉంటే కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..   

PREV
17
బరువు తక్కువుంటే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్ తో  ఇబ్బందిపడుతున్నారు. అయితే ఈ అధిక బరువే ఎన్నో ప్రాణాంత రోగాలకు దారితీస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. ఓవర్ వెయిట్ వల్ల లేనిపోని రోగాలు వస్తాయన్న ముచ్చట చాలా మందికి తెలుసు కానీ.. మరీ బరువు తక్కువుంటే కూడా ఇదే పరిస్థితి వస్తుందన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. నిజానికి తక్కువ బరువు కూడా మన శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. స్థూలకాయం మాదిరిగానే సన్నగా ఉండటం కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సన్నగా ఉండటానికి కారణాలు చాలానే ఉండొచ్చు. మరి సన్నగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది

మరీ సన్నగా ఉండటం వల్ల శరీరం బలహీనంగా ఉంటుంది. దీనివల్ల వాతావరణంలో చిన్న మార్పు వచ్చినా.. చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని సూచిస్తుంది. అందుకే ఇలాంటి వారు బలమైన ఆహారాలను ఎక్కువగా తినాలి. ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు ప్రయత్నించాలి. 
 

37
Bone Health

ఎముక బలహీనపడుతుంది

మరీ సన్నగా ఉన్న వ్యక్తి శరీరంలో కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చిన్న గాయమైనా ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే సన్నగా ఉండే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎముకలు దెబ్బతినడమే కాదు.. పగుళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది.

47

గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది

బరువు పెరగడానికి దారితీసే ప్రతి ఆహారాన్ని తినమని చాలా మంది సలహానిస్తుంటారు. దీంతో చాలా మంది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాలను ఎక్కువగా తినడం స్టార్ట్ చేస్తారు. కానీ వీటిని తినడం వల్ల వారి శరీరంలో విసెరల్ కొవ్వు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
 

57

అలసట

బరువు తక్కువున్న వారికి శరీరంలో శక్తి కొరత ఉంటుంది. దీంతో వీళ్లు ఏ చిన్న పనిచేసినా ఊరికే అలసిపోతుంటారు. వీళ్లు కోరుకున్నప్పటికీ వ్యాయామం అసలే చేయలేరు. ఇది ఇతర సమస్యలకు దారితీస్తుంది.

67

చిరాకు

సన్నగా ఉన్నవాళ్లను చాలా మంది రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఎగతాళి చేస్తుంటరు. దీనివల్ల వీరు చిరాకు పడుతుంటారు. కొన్నిసార్లైతే నిరాశకు గురవుతారు. చాలా సందర్భాలలో ఇలాంటి వ్యక్తులు ఇబ్బంది పడతారు. మందితో కలవడానికి అస్సలు ఇష్టపడరు.
 

77

గర్భధారణ సమస్యలు

మహిళలు బరువు తక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది గర్భధారణ సమయంలో ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. తక్కువ బరువు మహిళతో పాటుగా శిశువును కూడా ప్రభావితం చేస్తుంది. పిలల్లో పోషకాహార  లోపం ఉండొచ్చు. అందుకే బలాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories